ETV Bharat / health

ఉదయం నిద్రలేచాక ఇలా అనిపిస్తోందా? - అయితే, మీకు డయాబెటీస్ ముప్పు ఉన్నట్టే! - Diabetes Warning Signs

Diabetes Warning Signs : రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడే కాదు.. తగ్గినప్పుడూ అలర్ట్ కావాలి. ఎందుకంటే.. ఇది కూడా డయాబెటిస్​ను సూచిస్తుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే మీలో ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలంటున్నారు నిపుణులు. ఆ, లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.

Diabetes Symptoms In Morning
Diabetes Warning Signs (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 1:54 PM IST

Diabetes Symptoms In Morning : ప్రస్తుత రోజుల్లో మెజార్టీ పీపుల్ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి.. మధమేహం. అయితే, చాలా మంది డయాబెటిస్ అంటే.. షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు మాత్రమే వస్తుందనుకుంటారు. కానీ, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. అలా తగ్గడం కారణంగా మధుమేహం(Diabetes) వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే, రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిపోవడానికి కారణాలేంటి? ఈ పరిస్థితి తలెత్తితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రక్తంలో గ్లూకోజు స్థాయులు మరీ తక్కువస్థాయికి పడిపోయే స్థితిని "హైపోగ్లైసీమియా"గా పిలుస్తారు. ఇది తీవ్రమైతే స్పృహ కోల్పోవచ్చు, గుండెపోటు, మరణం ముప్పులూ పెరగొచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మధుమేహ చికిత్సలో వాడే కొన్ని మందులు కూడా హైపోగ్లైసీమియాకు దారితీసే అవకాశముందంటున్నారు. అదేవిధంగా భోజనం మానెయ్యటం, ఉపవాసం, తీవ్రమైన వ్యాయామం, కిడ్నీ వైఫల్యం, వృద్ధాప్యం వంటివీ రక్తంలో గ్లూకోజ్​ బాగా పడిపోవటానికి దారితీయొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి, రక్తంలో షుగర్ లెవల్స్​ కంట్రోల్​లో ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు.

ముఖ్యంగా ఉదయం పూట ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాలంటున్నారు. అలాగే మార్నింగ్ మాత్రమే కాదు.. రోజులో ఏ సమయంలో కనిపించినా కాస్త జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు. ఎందుకంటే.. అవి హైపోగ్లైసీమియాకు హెచ్చరిక సంకేతాలుగా చెప్పుకోవచ్చని చెబుతున్నారు. అవేంటంటే..

  • మార్నింగ్ లేవగానే తీవ్రమైన తలనొప్పి, చెమటలు పట్టడం
  • చర్మం పాలిపోవడం
  • అలసట, నీరసం, తలతిరగడం
  • ఉదయం నిద్రలేచాక నోరు పొడిబారడం
  • చూపు మసకబారడం
  • నాడి వేగంగా కొట్టుకోవడం
  • మార్నింగ్ లేదా రోజులో ఎప్పుడైనా దురదగా అనిపించడం
  • తగినంత నిద్రపోయినా మార్నింగ్ అలసటగా అనిపించడం
  • విపరీతమైన ఆకలి, దాహం, నైట్ టైమ్ కూడా ఇలా అనిపించవచ్చు
  • గాయాలు త్వరగా మానకపోవడం

అనుకోని రీతిలో బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావడం మంచిది. అలాగే వైద్యుడిని సంప్రదించి సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.

2019లో "అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ జర్నల్‌"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో ఉదయం లేచినప్పుడు తలనొప్పి, అలసట, చెమటలు రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటానికి సంబంధించిన సాధారణ లక్షణాలు అని కనుగొంది. ఈ పరిశోధనలో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్​లో డయాబెటిస్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్​ సి. హోప్ పాల్గొన్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్ : నోట్లో ఈ సమస్యలుంటే - షుగర్​ ముప్పు ఉన్నట్టే!

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

  • భోజనం మానెయ్యటం తగదు. అలాగే.. తరచూ గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవాలి. ఒక మాదిరి హైపో లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే ట్రీట్​మెంట్ తీసుకోవాలి.
  • అదేవిధంగా గ్లూకోజ్ లెవల్స్ పడిపోయినప్పుడు కొందరు స్పృహ తప్పి పడిపోతుంటారు. అప్పుడు స్పృహ తప్పినవారికి కొందరు నోరు తెరచి పంచదార పోయటం, చాక్లెట్‌ పెట్టటం, కూల్‌డ్రింకులు పోయటం వంటివి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. చాక్లెట్లు వంటివి గొంతులో ఇరుక్కుపోయి మరణించే ప్రమాదముందని సూచిస్తున్నారు
  • అలాగే.. స్పృహలో ఉండి మింగ గలిగే స్థితిలో ఉన్నవారికి గ్లూకోజు కలిపిన నీళ్లు,.. చక్కెర కలిపిన కాఫీ, టీ.. కూల్‌డ్రింకుల వంటి ద్రవాలు ఇవ్వాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఘనాహారం ఇవ్వకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఎందుకంటే.. హైపోగ్లైసీమియాలో లాలాజల ఉత్పత్తి తగ్గటం వల్ల నోరు ఎండిపోయి ఉంటుంది. దాంతో ఆహారాన్ని నమిలి మింగటం కష్టమవుతుందని గమనించాలంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డయాబెటిస్ రోగులు ట్యాబ్లెట్స్​ అవతల విసిరికొట్టొచ్చు! - ఈ హెర్బల్‌ డ్రింక్స్‌ తాగితే చాలు!

షుగర్ బాధితులు - రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.