ETV Bharat / health

కండ్లకలక సమస్య ఇబ్బంది పెడుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే బిగ్​ రిలీఫ్​! - Conjuctivities Causes And Symptoms

Conjuctivities Causes And Symptoms : కండ్లకలక సమస్యలు వేసవిలో ఎక్కువగా రావడానికి కారణమేంటి? వాటి నుంచి తప్పించుకునే నివారణ మార్గాలేంటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Conjuctivities Causes And Symptoms
Conjuctivities Causes And Symptoms (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 1:42 PM IST

Conjuctivities Causes And Symptoms : విహార యాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు చాలా మంది వేసవి సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు. సెలవులు అలా వచ్చాయో లేదా ఇలా ప్రయాణాలు మొదలు పెట్టేస్తారు. అలా బయట తిరగాలంటే ఓ వైపు ఎండ వేధిస్తుంటే మరో వైపు కండ్లకలకలు భయపెడుతున్నాయి. వేసవి కాలంలో చాలా మంది కండ్లకలక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీన్నే "పింక్ ఐ" అని కూడా పిలుస్తారు. మీ సమ్మర్ హాలిడేస్ సరదాలను ఇది అడ్డుగా రాకుండా ఉండాలంటే, దీని కారణాలు, లక్షణాలతో పాటు నివారణ చర్యలు కూడా తెలుసుకుంటే మంచిది.

కండ్లకలకలు ఎందుకు వస్తాయి?
సాధారణంగా కండ్లకలక అనేది వైరస్, బ్యాక్టీరియా, ఎలర్జీ కారకాల ద్వారా వస్తుంది. ముఖ్యంగా వేసవిలో పుప్పొడి, అచ్చు వంటి ఎలర్జీ కారకాలు ఎక్కువగా బయట పడతాయి. వేడి వాతావరణం కారణంగా ఇవి మరింత పెరిగి కంటి ఎలర్జీలకు కారణమవుతాయి. ఫలితంగా కండ్లకలక ఎర్రగా మారడం, వాపు, మంట వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వేసవిలో వేడిలో బయట ఎక్కువ సమయం ఉండటం, ఇతరులతో ఎక్కువ సన్నిహితంగా గడపడం వల్ల వైరస్, బ్యాక్టీరియా రూపంలో కండ్ల కలక వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లు, బీచ్​లు కండ్లకలక వ్యాప్తిని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • కండ్లకలక లక్షణాలు
    వ్యాధిగ్రస్థుల కళ్లు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి.
  • కంటిరెప్పలు ఉబ్బడం.
  • కళ్ళలో మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం అవుతుంది.

కండ్లకలక రకాలు:

1. వైరల్ కండ్లకలక:
ఇది చాలా సాధారణ కండ్లకలకగా చెప్పచ్చు. చికిత్స చేయకుండానే రెండు వారాల్లో ఇది తగ్గిపోతుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఒక క్లాత్​ను తడిపి కళ్లపై ఉంచుకుంటూ ఉండాలి. రోజు మొత్తం మీద నాలుగైదుసార్లు ఇలా చేయచ్చు.

2. బ్యాక్టీరియల్ కండ్లకలక
దీని నుంచి బయట పడటానికి వైద్యులు యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్​ను సూచిస్తారు. వాటి మేరకు పూర్తి కోర్సును వాడటం వల్ల బ్యాక్టీరియల్ కండ్లకలక తగ్గుతుంది.

3. అలెర్జీ కండ్లకలక
పుప్పొడి వంటి ఎలర్జీ కారకాల కారణంగా ఇది చాలా మంటను కలిగిస్తుంది. దీనికి వైద్యుడి సలహా మేరకు యాంటీహిస్టామైన్ కంటి చుక్కల ద్వారా చికిత్స చేసుకోవచ్చు.

  • కండ్లకలక వ్యాప్తిని నియంత్రించడానికి, నివారించడానికి కొన్ని మార్గాలున్నాయి:
  • కళ్లను తరచుగా తాకడం, రుద్దడం చేయకూడదు
  • చేతులును తరచుగా శుభ్రం చేసుకోవాలి.
  • దిండు కవర్లు, తువ్వాలను క్రమం తప్పకుండా మార్చాలి.
  • స్విమ్మింగ్ చేసేటప్పుడు గాగుల్స్ ధరించాలి. కండ్లకలకు ఉన్నవారు స్విమ్మింగ్ చేయకూడదు.
  • అలెర్జీ కారకాలకు దూరంగా ఉండాలి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

యూరిక్ యాసిడ్ ఎక్కువైందా? ఆయుర్వేద ప్రకారం ఈ ఆకులు తింటే ఆల్​ క్లియర్! - How To Control Uric Acid Naturally

బాబోయ్​ ఎండలు! నీరు తగినంత తాగుతున్నారా? డీహైడ్రేషన్​ను గుర్తించడమెలా? - Symptoms Of Dehydration

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.