ETV Bharat / health

మీ పిల్లలు జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా ? ఇలా చేస్తే పూర్తిగా మానేస్తారు!

Best Ways To Avoid Junk food For Child : పిల్లలు ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో జంక్‌ఫుడ్‌ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. కానీ.. ఈ ఫుడ్ తినడం వల్ల ఎన్నో నష్టాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ.. ఈ అలవాటు మాన్పించడం పెద్దలకు సవాలే. మీ పిల్లలు కూడా ఈ ఫుడ్ ఎక్కువగా తినేస్తుంటే.. ఈ టిప్స్ పాటించండి!

Best Ways To Avoid Junk food For Child
Best Ways To Avoid Junk food For Child
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 11:27 AM IST

Best Ways To Avoid Junk food For Child : పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే హెల్దీగా ఉంటారు. తీసుకునే ఆహారంలో పోషకాలు నిండుగా ఉండాలి. కానీ.. నేడు చాలా మంది పిల్లలు ఇంట్లో వండిన వాటి కన్నా బయట దొరికే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఫుడ్​లో ఎటువంటి పోషకాలూ ఉండవు. అంతేకాదు.. ఇవి తినడం వల్ల పిల్లలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. జంక్‌ఫుడ్‌ తినకుండా ఎలా మాన్పించాలో నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దూరంగా..
పిల్లలు తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తారు. వారు ఎటువంటి అభిరుచులను కలిగి ఉంటే.. అవే పిల్లలూ పాటిస్తారని నిపుణులంటున్నారు. అయితే.. తల్లిదండ్రులుగా మీరు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాబట్టి.. మార్పు మీ నుంచే ప్రారంభం కావాలి. ఎలా అంటే.. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ ఇంట్లోకి తీసుకురాకుండా.. హోమ్‌ మేడ్‌ రెసిపీస్‌ తయారు చేయాలి.

వారికి తెలియజేయండి..
పిల్లలకు జంక్‌ఫుడ్ తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి అవగాహన ఉండదు. అప్పుడు తల్లిదండ్రులుగా మనం వారికి ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పాలి. ఏ ఆహార పదార్థాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి? అవి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది వారికి వివరించాలి. అర్థమయ్యేలా చెప్పాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

అందంగా అలంకరించండి..
సాయంత్రం పిల్లలు బయట దొరికే స్నాక్స్‌ తినకుండా ఉండటానికి.. ఇంట్లోనే క్యారెట్లు, బీట్‌రూట్‌, దోసకాయ ముక్కలతో అందంగా డిజైన్‌ చేసి ప్లేట్‌లో సర్వ్‌ చేయండి. దీనివల్ల ఆ ప్లేట్‌ వారిని ఆకర్షిస్తుంది. అప్పుడు మెల్లగా వాటిని తినడం ప్రారంభిస్తారు.

అప్పుడప్పుడూ జంక్‌ఫుడ్‌..
చాలా కాలంగా జంక్‌ఫుడ్‌ తింటున్న పిల్లలు.. ఆ అలవాటును అంత తొందరగా మానుకోలేరు. చిరుతిళ్లను పూర్తిగా తినకుండా ఉండటానికి కొంత సమయం పడుతుందని నిపుణులంటున్నారు. కాబట్టి.. వారికి ఎప్పుడో ఒకసారి జంక్‌ఫుడ్‌ అందించాలని చెబుతున్నారు. అది కూడా చాలా తక్కువ ఇవ్వాలని సూచిస్తున్నారు. మిగిలిన సమయాల్లో పోషకాహారం అందించాలని చెబుతున్నారు.

స్నాక్‌ బాక్సుల్లో..
పిల్లలను జంక్‌ఫుడ్‌ నుంచి దూరం చేసే సమయంలో వారికి తాజా పండ్లు, కూరగాయలు, సలాడ్‌లను ఎక్కువగా ఇవ్వాలి. అలాగే వాటిని తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేయాలి. వారి లంచ్‌ బాక్సుల్లో చాక్లెట్లు, బిస్కెట్లు పెట్టకుండా.. ఫ్రూట్‌ సలాడ్‌లు, పల్లీలు, బెల్లంతో చిక్కీలు, లడ్డూలు, బాదం, పిస్తాతో చేసిన పదార్ధాలు, మినప, ఉలవ పిండితో లడ్డూలు, రాగులు, జొన్నలు, సజ్జలతో చేసే స్నాక్స్‌ వంటి వాటిని అందించాలని సూచిస్తున్నారు. ఒక క్రమ పద్ధతిలో.. కాస్త ఓపికతో ఈ పనులు చేస్తే.. పిల్లలు దారిలో పడతారని చెబుతున్నారు.

అలర్ట్ : మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - గుండెపోటుకు దారితీయొచ్చు!

లంచ్​ బదులు ఈ సలాడ్​లు ట్రై చేస్తే - ఈజీగా బరువు తగ్గుతారు!

తిన్న వెంటనే కడుపులో మంటగా ఉంటోందా? కారణాలు ఇవే అంటున్న నిపుణులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.