ETV Bharat / health

బరువు తగ్గాలా? - మీ బ్రేక్​ఫాస్ట్​లో ఈ డ్రై ఫ్రూట్స్​ చేర్చుకుంటే బెస్ట్​ రిజల్ట్​! - Best DRY FRUITS FOR WEIGHT LOSS

Best Weight Loss Foods : అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజల్ట్ కనిపించడం లేదా? అయితే, ఇది మీకోసమే. డైలీ బ్రేక్​ఫాస్ట్​లో ఈ డ్రై ఫ్రూట్స్​ను భాగం చేసుకుంటే.. ఈజీగా బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటారని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Dry Fruits For Weight Loss
Best Weight Loss Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 4:28 PM IST

Best Dry Fruits For Weight Loss : నేటి రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దాన్ని తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వాకింగ్, జిమ్​కి వెళ్లడం చేస్తే.. మరికొందరు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు. ఇంకొందరైతే డైటింగ్‌ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటుంటారు. అయితే, ఇకపై అలా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేకుండా.. మీ మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో కొన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు(Weight) తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, బరువు తగ్గడానికి, కంట్రోల్​లో ఉండడానికి తోడ్పడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బాదం : బరువు తగ్గడానికి బాదంపప్పులు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటిలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వీటిని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు బాదంను మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకోవడం మంచిదంటున్నారు.

2003లో "International Journal of Obesity"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆరు వారాల పాటు రోజుకు 50 గ్రాముల బాదం పప్పులు తిన్న వ్యక్తులు తమ శరీర బరువులో 1.36 పౌండ్లు (0.62 కిలోలు) కోల్పోయారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్​లోని డెవిస్​లో ఉన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జోయెల్ న్యూమన్ పాల్గొన్నారు. బరువు తగ్గించడంలో బాదంలోని పోషకాలు చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఎండు ద్రాక్ష : ఇవి కూడా వెయిట్ మేనేజ్​మెంట్​లో ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఎండు ద్రాక్షలో సహజమైన చక్కెరలు, ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు చాలా బాగా సహాయపడతాయంటున్నారు. వీటిని నానబెట్టి తింటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.

వాల్‌నట్‌లు : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో వాల్​నట్​లు చేర్చుకోవడం కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

ఇంట్రస్టింగ్ : చపాతీ బదులు జొన్నలతో చేసిన ఈ ఆహారాన్ని తినండి - కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు!

డేట్స్ : వీటినే ఖర్జూరాలు అని అంటారు. వీటిలో ఫైబర్, విటమిన్లతో పాటు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా వీటిని మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటిని తినడం వల్ల ఇందులోని ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్​ని ఇస్తాయి. దాంతో ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకోవడం మంచిదంటున్నారు.

జీడిపప్పు : దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు అతిగా తినాలనే కోరికలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు.

అంజీర్ : బరువు తగ్గించడంలో అంజీర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో అధికంగా ఉండే డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి. ఫలితంగా వెయిట్ లాస్ అవ్వడానికి తోడ్పడతాయంటున్నారు. ఇవేకాకుండా.. పిస్తా, ఆప్రికాట్లు వంటివి డైలీ మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకోవడం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? - ఇలా చేస్తే వారానికి అరకిలో తగ్గడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.