ETV Bharat / health

మీ పిల్లలకు ఈ అలవాట్లు ఉన్నాయా? - అయితే వారి మెదడుకు తీవ్ర దెబ్బ! - Bad Habits to Damage Children Brain - BAD HABITS TO DAMAGE CHILDREN BRAIN

Bad Habits to Damage Children Brain: పిల్లలు రోజూ పాటించే అలవాట్లు వారి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా 8 అలవాట్లు వాళ్ల బ్రెయిన్​పై తీవ్రమైన ఎఫెక్ట్​ చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. వాటి ద్వారా పలు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు..!

Bad Habits to Damage Children Brain
Bad Habits to Damage Children Brain
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 12:04 PM IST

Bad Habits to stops the Children Brain Development: తెలిసో, తెలియకో పాటించే అలవాట్లు, జీవన విధానం.. మన మెదడుపై చెడు ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా మతిమరుపు, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఈ సమస్య అధికమవుతుంది. వాటిని నియంత్రిస్తే పిల్లల బ్రెయిన్​ షార్ప్​గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో చూద్దాం..

చీకటిలో ఎక్కువగా ఉండటం: చీకట్లో ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని సహజ సిర్కాడియన్ రిథమ్‌కు భంగం కలుగుతుంది. ఇది మానసిక స్థితి, జ్ఞానం, మొత్తం మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి నిద్ర మేల్కొనే చక్రాలను నియంత్రించడానికి, సరైన మెదడు ఆరోగ్యాన్ని నిర్వహించడానికి వీలైంనంతవరకు లైటింగ్​ ఉన్న ప్రదేశంలో ఉండటమే మంచిదని నిపుణులు అంటున్నారు.

నెగిటివ్​ న్యూస్​కు రియాక్ట్​ అవ్వడం: పిల్లలకు ఎప్పుడు మంచి మాటలే చెప్పాలి. ముఖ్యంగా టీవీల్లో వచ్చే నెగిటివ్​ న్యూస్​ పట్ల పిల్లలు ఎట్రాక్ట్​ అవ్వకుండా పేరెంట్స్​ జాగ్రత్తలు తీసుకోవాలి. నెగిటివ్​ న్యూస్​ వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆందోళన, నిరాశ, బలహీనమైన అభిజ్ఞా పనితీరుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలకు బాధ కలిగించే వార్తలను చెప్పకపోవడం పిల్లల్లో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.

హై వాల్యూమ్​తో హెడ్​ఫోన్స్​ యూజ్​ చేయడం: చాలా మంది పిల్లలకు ఎక్కువ వాల్యూమ్‌ పెట్టుకుని సాంగ్స్​ వినడం లేదా సినిమాలు చూడటం ఇష్టం. అయితే ఇలా ఎక్కువ సౌండ్​ పెట్టుకోవడం వల్ల చెవి లోపల సున్నితమైన నిర్మాణాలు దెబ్బతింటాయి. ఇది వినికిడి లోపానికి దారితీస్తుంది. కాబట్టి పిల్లల్లో ఆ అలవాటు మార్పించగలిగితే పిల్లల్లో వినికిడి లోపం సమస్య తగ్గడంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.

ఈ ఫోబియా ఉన్నవారు సంతోషంగా ఉండడానికి భయపడతారట! - ఈ లక్షణాలుంటే మీకు ఆ సమస్య ఉన్నట్లే! - Cherophobia Symptoms

అధిక స్క్రీన్ సమయం: చిన్న పిల్లలకు రోజుకు ఒక గంట కంటే ఎక్కువ స్క్రీన్ చూడకూడదని నిపుణులు అంటున్నారు. అయితే, చాలా మంది పిల్లలు రోజుకు గంటల తరబడి టీవీ, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్​ వంటి ఎలక్ట్రానిక్​ పరికరాలతో గడుపుతుంటారు. ఇది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అభిజ్ఞా పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి స్క్రీన్ టైమ్‌పై లిమిట్​ సెట్ చేయడం, ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ప్రోత్సహించడం.. ఆరోగ్యకరమైన మెదడు అలవాట్లకు, మొత్తం శ్రేయస్సుకు తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

2019లో నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెంటల్​ హెల్త్​ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఎక్కువ స్క్రీన్​ టైమ్​ కలిగిన పిల్లలు ఆందోళన, నిరాశ, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 8 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన 11 వేల మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్ర ప్రొఫెసర్​గా పనిచేస్తున్న Dr. Jean Twenge పాల్గొన్నారు. పిల్లలు సాధ్యమైనంత తక్కువగా స్క్రీన్ చూడాలని చెప్పారు.

ఎక్కువ చక్కెర తీసుకోవడం: పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. ఇందులో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలా మంది పిల్లలు అధిక చక్కెర, జంక్​ ఫుడ్​, ప్రాసెస్​ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే అధిక చక్కెర.. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. వాపు, ఇన్సులిన్ నిరోధకత, ఇవన్నీ.. మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి పిల్లలు తినే ఆహారంలో అధిక చక్కెర లేకుండా చూసుకోవాలి.

మీ పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా? - ఇలా చేశారంటే వారిలో మార్పు రావడం గ్యారెంటీ! - Parenting Tips

శారీరక శ్రమ లేకపోవడం: పిల్లల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. అలాగే అభిజ్ఞా పనితీరును తగ్గిస్తుంది. ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు ప్రతిరోజూ ఒక గంట శారీరక శ్రమ అవసరం. కాబట్టి.. పిల్లల చేత వీలైనన్నీ ఎక్సర్​సైజ్​లు చేయించడం మంచిదని నిపుణులు అంటున్నారు.

పేలవమైన నిద్ర: పిల్లలకైనా, పెద్దలకైనా తగినంత నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అయితే పిల్లలు ఎక్కువ సమయం ఫోన్లు, టీవీలతో గడపటం వల్ల తగినంత నిద్ర పోరు. నిద్ర సరిపోని కారణంగా పలు ఆరోగ్య సమస్యలతో పాటు మెదడు పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. అలాగే అభిజ్ఞా పనితీరును దెబ్బతీస్తుంది. మానసిక స్థితి, ప్రవర్తన, మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి పిల్లలు రాత్రి పూట 8-10 గంటల నిద్ర పోయేలా చూసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది.

ఒత్తిడి: పిల్లలు పాఠశాల, కుటుంబ సమస్యలు లేదా స్నేహితులతో సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. శ్రద్ధ, జ్ఞాపకశక్తి, మానసిక సమస్యలకు దారితీస్తుంది.

నిద్ర లేవకుండా అలారం స్నూజ్ చేస్తున్నారా? - చేజేతులా చేసుకుంటున్నట్టే! - ALARM SNOOZING PROBLEMS

చిన్నప్పటి అనారోగ్యం - పెద్దయ్యాక తెచ్చెను పెను ప్రమాదం ! - Childhood Illness

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.