ETV Bharat / health

అలర్ట్ : మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? - అయితే, మీ బ్రెయిన్​కు ముప్పు పొంచి ఉన్నట్టే! - Brain Health Damage Habits - BRAIN HEALTH DAMAGE HABITS

Brain Health Damage Habits : మన శరీరంలో మెదడు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే.. బ్రెయిన్​ ఆరోగ్యంగా చురుగ్గా, పవర్​ఫుల్​గా వర్క్ చేయాలంటే కొన్ని అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

These Habits Can Damage Brain Health
Brain Health Damage Habits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 10:08 AM IST

These Habits Can Damage Brain Health : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్.. బ్రెయిన్. అది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతాం. అంతటి ముఖ్యమైన బ్రెయిన్​ ఆరోగ్యం.. కొన్ని అలవాట్ల కారణంగా ఎవరికి వారే దెబ్బ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి.. బ్రెయిన్​ను(Brain) దెబ్బతీసే ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చక్కెర : చక్కెర ఉండే ఫుడ్స్ ఎంత తీసుకుంటే.. మెదడుపై అంత ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ హెచ్చుతగ్గులకు చక్కెర కారణమవుతుందని.. వాపు, ఇన్సులిన్ నిరోధకత వంటి పరిస్థితులకు కారణమవుతుందని అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ కలిసి మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.

2016లో "అల్జీమర్స్ డిసీజ్ ఎండ్ డెమెన్షియా" అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక చక్కెర ఆహారాన్ని తినే వ్యక్తులలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో పనిచేసే న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌ డాక్టర్ మైఖేల్ మోస్ పాల్గొన్నారు. అధిక చక్కెర వినియోగం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

కెఫెన్ : ఇది కూడా మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అధిక కెఫెన్ వినియోగం మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా బ్రెయిన్ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే, కెఫెన్ వినియోగం నిద్ర సమస్యలకు దారితీస్తుందంటున్నారు. దీని కారణంగా డిమెన్షియా వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి.. నిద్రలేమి బారిన పడకుండా రోజులో తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

ధూమపానం : పొగాకు సంబంధిత ఉత్పత్తుల్లోని నికోటిన్ మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందట. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో జరిపిన ఒక నివేదిక ప్రకారం.. సిగరెట్ తాగడం వల్ల మెదడు కుంచించుకుపోతుందని వెల్లడైంది. అది డిమెన్షియా, అల్జీమర్స్ వంటి బ్రెయిన్ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు.

ఈ పనులు అలవాటు చేసుకోండి - మీ బ్రెయిన్​ సూపర్ పవర్​గా మారిపోతుంది!

అధిక స్క్రీన్ సమయం : నేటి టెక్నాలజీ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దాదాపు గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికరాలతో గడుపుతున్నారు. ఈ అలవాటు కూడా మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి.. వీలైనంత వరకు స్క్రీన్ టైమ్​ తగ్గించుకునేలా చూసుకోవాలంటున్నారు. అందుకోసం స్క్రీన్ టైమ్‌పై లిమిట్​ సెట్ చేయడం, ప్రత్యామ్నాయ కార్యకలాపాల్లో పాల్గొనడం చేయాలంటున్నారు.

తలతో ఫుట్‌బాల్‌ను కొట్టడం : మీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటుకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. గత సంవత్సరం ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మిగిలిన వారి కంటే ఫుట్​బాల్ ఆడేవారిలో డిమెన్షియా వచ్చే అవకాశం 50శాతం ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి, ఫుట్​బాల్ ఆడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు.

చివరగా.. పైన చెప్పినన్నీ మన మెదడు పనితీరుపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? - బ్రెయిన్​లో ఏదో జరుగుతోందని టెన్షన్​ పడుతున్నారా?? - ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.