ETV Bharat / health

ఏం తిన్నా తినకపోయినా - పరగడుపున మాత్రం ఇవి అస్సలే తినొద్దు! - Foods To Avoid In Empty Stomach - FOODS TO AVOID IN EMPTY STOMACH

Foods To Avoid In Empty Stomach: ఉదయాన్నే తప్పకుండా టిఫెన్ తినాలంటారు ఆరోగ్య నిపుణులు. అయితే.. అందులో మాత్రం కొన్ని ఆహార పదార్థాలు అస్సలే ఉండకూడదని చెబుతున్నారు. మరి పరగడుపున తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

Foods To Avoid In Empty Stomach
Foods To Avoid In Empty Stomach (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 1:22 PM IST

Avoid These Foods on Empty Stomach: పరగడుపున ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న విషయాలను పట్టించుకోకుండా కొంత మంది ఏదో ఒకటి తింటుంటారు. అయితే అలా తింటే అనవసరమైన అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు అవుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. పరగడుపున తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

సిట్రస్​ పండ్లు: ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యేదై ఉండాలని నిపుణులు అంటున్నారు. అందువల్ల పొద్దున్నే తీసుకునే ఆహారంలో సిట్రస్​ పండ్లు ఉండకూడదని అంటున్నారు. ముఖ్యంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష, టమాటలు వంటి పుల్లని పండ్లను పరగడుపున తినకూడదని చెబుతున్నారు. పుల్లటి పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని.. కడుపులో అల్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

పచ్చి కూరగాయలు: పరగడుపున ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది పచ్చి కూరగాయలు తింటుంటారు. అవి కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. పచ్చి కూరగాయల్లో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయం తింటే సరిగా జీర్ణం కాక ఇబ్బందులు వస్తాయని, పొత్తికడుపులో నొప్పి వస్తుందని చెబుతున్నారు.

తల్లిదండ్రులకు మూర్ఛ వ్యాధి ఉంటే పిల్లలకూ వస్తుందా? - నిపుణుల సమాధానమిదే! - Epilepsy Causes

స్పైసీ ఫుడ్​: చాలా మందికి పరగడుపున స్పైసీ ఫుడ్​ తినే అలవాటు ఉంటుంది. అయితే స్పైసీ ఫుడ్​ తినడం వల్ల కడుపులో ఆహారం తొందరగా జీర్ణం కాదని.. అవి జీర్ణవ్యవస్థలో మంటను కలిగిస్తాయని అంటున్నారు. అందుకే ఉదయాన్నే ఎట్టి పరిస్థితులలోనూ కారం కారంగాను, మసాలాలతోను వండినస్పైసీ ఫుడ్​ను తినడం మంచిది కాదని చెబుతున్నారు.

డ్రింక్స్​: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కారణం.. లంచ్, బ్రేక్​ఫాస్ట్ మధ్య చాలా సేపు మన పొట్ట ఖాళీగా ఉండడమే అంటున్నారు. ముఖ్యంగా.. నారింజ, నిమ్మరసం ఖాళీ కడుపుతో తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే జ్యూసులు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని.. తద్వారా నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

2017లో "ది జర్నల్​ ఆఫ్​ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగిన వ్యక్తులు మలబద్ధకం సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ పోషకాహార పరిశోధకుడు, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్​ డాక్టర్ డేవిడ్ జె. లీ పాల్గొన్నారు. పండ్ల రసాల్లోని చక్కెర, ఫైబర్ మలబద్ధకానికి కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్ : మద్యంలో సోడా మిక్స్​ చేస్తే జరిగేది ఇదే! - వైద్యుల హెచ్చరిక! - Effects of Drinking Alcohol Soda

కాఫీలు: ఉదయం పరగడుపున చాలా మంది టీ, కాఫీలను తాగుతుంటారు. అయితే.. ఇవి ఏ మాత్రం తీసుకోదగినవి కావని అంటున్నారు. కాఫీలో కెఫెన్ అనే పదార్థం ఉండడం వల్ల అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపి ఎసిడిటీకి కారణంగా మారుతుందని చెబుతున్నారు. డయేరియాకు దారితీస్తుందని అంటున్నారు.

వేయించిన ఆహారాలు: చాలా మందికి ఆయిల్​లో​ ఫ్రై చేసిన ఫుడ్స్​ అంటే ఇష్టం. అందుకే వాటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే పరగడుపున వీటిని తినడం వల్ల తొందరగా జీర్ణం కావని.. తద్వారా కడుపులో మంటకు కారణమవుతాయని అంటున్నారు.

ప్రాసెస్​ ఫుడ్స్​: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ప్యాకెట్​ ఫుడ్స్​, ప్రాసెస్​ చేసిన ఫుడ్స్​ను తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఫాస్ట్​ఫుడ్​, చిప్స్​, ప్యాక్​ చేసిన వంటి ప్రాసెస్​ ఫుడ్స్​లో షుగర్​, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయని.. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఆహారాలు కలిపి తింటున్నారా? - ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలో పడేసుకున్నట్టే! - Avoid These Food Combinations

నూడుల్స్​ తినడం నిజంగా ప్రమాదమా? - నిపుణులు చెబుతున్న నిజాలివి! - Side Effects of Instant Noodles

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.