ETV Bharat / health

అలర్ట్​: ఈ ఫుడ్స్​ తింటున్నారా? మీ కోపం ఓ రేంజ్​లో పెరగడం ఖాయం! - Anger Increasing Foods - ANGER INCREASING FOODS

Anger: మనం తీసుకునే ఆహారం కేవలం శారీరక ఆరోగ్యంలోనే కాకుండా మానసిక స్థితి, భావోద్వేగాలను ప్రభావితం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు ఉత్సహాన్ని, శక్తిని పెంచే విధంగా ఉంటే.. మరికొన్ని మాత్రం కోపం, చిరాకు వంటి వాటికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఈ ఫుడ్స్​ కోపాన్ని పెంచుతాయని అంటున్నారు నిపుణులు.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Anger Increasing Foods
Anger Increasing Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 3:06 PM IST

Anger Increasing Foods: కొంతమందికి కోపం ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. మనసుకు నచ్చని మాటలు విన్నా, నచ్చనివారిని చూసినా, నచ్చని పనులు చేసినా.. కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం వంటివి కూడా కోపానికి కారణాలు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారాలు కూడా కోపాలకి కారణమవుతాయని.. ముఖ్యంగా ఈ ఫుడ్స్​ తింటే కోపం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రస్తుతం చాలా మంది ప్రాసెస్డ్​ ఫుడ్స్​పై ఇంట్రస్ట్​ చూపిస్తున్నారు. కారణం ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ప్రాసెస్ చేసిన ఫుడ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా ఫాస్ట్​ఫుడ్​లో ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మీ న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని.. మానసిక స్థితి, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్​ను రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల మీ ఒంట్లో శక్తి తగ్గుతుందని.. కోపం కూడా పెరుగుతుందని అంటున్నారు.

కెఫెన్: చాలా మందికి ఉదయం ఓ కప్పు కాఫీతోనే డే స్టార్ట్​ అవుతుంది. అయితే కోపాన్ని పెంచే లిస్ట్​లో కెఫెన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని కొన్ని సార్లు ఆందోళన, ఒత్తిడి, కోపం పెరగడం వంటి మానసిక సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా కెఫిన్​ను ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.

2016లో జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకియాట్రీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కెఫెన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, నిరాశ, కోపం, మానసికస్థితి రుగ్మతల వంటి సమస్యలు వస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ లో సైకియాట్రీ విభాగానికి చెందిన డాక్టర్‌ అడ్రియానా షెల్డన్ పాల్గొన్నారు.

కరివేపాకు తీసి పడేస్తున్నారా? - మీ ఆరోగ్యానికి ఎంత నష్టం చేసుకుంటున్నారో తెలుసా! - Health Benefits of Curry Leaves

షుగర్ రిచ్ ఫుడ్స్​: షుగర్​ అధికంగా ఉండే ఆహారాలు కూడా కోపాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. క్యాండీలు, చాక్లెట్లు, కూల్​డ్రింక్స్​, స్వీట్లతో పాటుగా షుగర్​ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని.. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకును కలిగిస్తుందని, కోపాన్ని పెంచుతాయని అంటున్నారు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఆల్కహాల్: ఆల్కహాల్ కూడా కోపాన్ని మరింత పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మందును ఎక్కువగా తాగేవారిలో కోపం, మానసిక సమస్యలు బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కారణం ఆల్కహాల్ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని అంటున్నారు. కాబట్టి మందు తాగే అలవాటును తగ్గించుకోమని సలహా ఇస్తున్నారు.

ఉప్పు: ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, స్నాక్స్​ కోపాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. అధిక సోడియం.. శారీరక, మానసిక శ్రేయస్సు రెండింటిని ప్రభావితం చేసే అధిక రక్తపోటుకు దోహదం చేస్తుందని అంటున్నారు. అందుకే ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ 5 రకాల బాడీ పెయిన్స్​లో ఏది కనిపించినా అలర్ట్ కావాల్సిందే - గుండెపోటు సంకేతం కావొచ్చట! - Heart Attack Warning Signs

రక్త హీనత నుంచి.. రక్త పోటు దాకా - ఈ వాటర్​ తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్! - Benefits Of Drumstick Water

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.