ETV Bharat / health

అద్భుతం : బీపీ, షుగర్​తో ఏళ్లతరబడి అవస్థలు పడుతున్నారా? - ఇవి తిన్నారంటే రెండు ఔట్! - Andu Korralu Benefits - ANDU KORRALU BENEFITS

Andu Korralu Health Benefits : బీపీ, షుగర్ నుంచి.. జీర్ణవ్యవస్థ, గుండె సమస్యల దాకా.. పెద్ద పెద్ద రోగాలతో జనం అవస్థలు పడుతుంటారు. వీటిని తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. మిల్లెట్స్‌లోని ఈ రకం గింజలు తిన్నారంటే.. అద్భుతాలు చూస్తారని నిపుణులు చెబుతున్నారు.

Andu Korralu
Andu Korralu Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 12:06 PM IST

Updated : Jun 14, 2024, 12:12 PM IST

Andu Korralu Health Benefits : చిరుధాన్యాల్లో ఒక రకమైనటువంటి అండు కొర్రలను తినడం వల్ల షుగర్‌, బీపీ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, శరీరానికి ఎంతో మేలు చేసే ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఇందులో అధికంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గుతారు :
అండు కొర్రలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించి.. ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు రోజూ అండు కొర్రలు తినడం వల్ల బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని చైనా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన 'డాక్టర్‌ X.Y. జాంగ్' పాల్గొన్నారు. రోజూ అండు కొర్రలు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్​ - ఈ ఫుడ్స్​కు దూరంగా ఉండకపోతే - మీ స్ట్రెస్ లెవల్స్ మరింత పెరుగుతాయి! - These Foods Can Increase Stress

షుగర్‌కు చెక్‌ :
అండు కొర్రలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమయ్యే షుగర్‌ వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే మధుమేహం వ్యాధితో బాధపడేవారు వీటిని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. అండు కొర్రలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ కలిగిన ఆహారం. ఇవి తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు నెమ్మదిగా పెరుగుతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు :
వీటిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండు కొర్రలను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులంటున్నారు.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది :
వీటిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అండుకొర్రలను డైలీ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులంటున్నారు. అలాగే క్యాన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు.

మరికొన్ని ప్రయోజనాలు :

  • ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే ముడతలు రాకుండా అడ్డుకుంటాయి.
  • రక్తహీనత సమస్య తగ్గుతుంది.
  • రక్తపోటు అదుపులో ఉంటుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇంట్రస్టింగ్​ - రోజూ ఒక ఉసిరికాయ తింటే - మీ బాడీలో జరిగే మార్పులు ఊహించలేరు! - Amla Health Benefits And Side Effects

ఈ అలవాట్లు మీలో ఉంటే - ఒక్క మొటిమ కూడా మీ ముఖంపై కనపడదు! పైగా గ్లోయింగ్​ స్కిన్​ పక్కా! - Pimples Free Skin Habits

Last Updated : Jun 14, 2024, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.