ETV Bharat / entertainment

'ఫ్యామిలీ స్టార్' సాంగ్​కు బుట్టబొమ్మ స్టెప్పులు - భలే క్యూట్​గా ఉందిగా! - విజయ్ దేవరకొండ పూజా హెగ్డే డ్యాన్స్

Vijay Devarakonda Pooja Hegde Dance : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్​ దేవరకొండ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా స్టార్, బుట్టబొమ్మ పూజ హెగ్డేతో కలిసి ఓ ఈవెంట్​లో పాల్గొన్నారు. తన మూవీలోని పాటకు హుక్ స్టెప్​ వేసి సందడి చేశారు.

Vijay Devarakonda Pooja Hegde Dance
Vijay Devarakonda Pooja Hegde Dance
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 12:13 PM IST

Updated : Mar 3, 2024, 12:37 PM IST

Vijay Devarakonda Pooja Hegde Dance : గతేడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్‌'గా మారి మరింత ఎంటర్​టైనింగ్​ కంటెంట్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. 'గీత గోవిందం' ఫేమ్​ డైరెక్టర్ పరశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆయన తనలోని సరికొత్త కోణాన్ని చూపించనున్నారు.

ఇటీవలే విడుదలైన టైటిల్​ గ్లింప్స్​ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇందులోని 'ఐరనే వంచాలా ఏంటి' అన్న డైలాగ్ నెట్టింట ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తుండటం వల్ల ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మరింతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అందరి నోట నానూతూనే ఉంది.

తాజాగా ఈ మూవీ నుంచి నంద నందనా అనే సాంగ్​ను మేకర్స్ విడుదల చేశారు. క్యాచీ లైన్స్​తో ఆకట్టుకుంటున్న ఈ మెలోడీ యూత్​ను తెగ ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఇదే సాంగ్​కు విజయ్‌ దేవరకొండ, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి స్టెప్పులేశారు. ఓ కాలేజ్‌లో నిర్వహించిన ఆర్ట్‌ ఫెస్టివల్‌లో ఈ ఇద్దరూ సందడి చేశారు. ఫెస్ట్​లో భాగంగా ఇలా ఈ పాటకు డ్యాన్స్​ చేసి స్టూడెంట్స్​ను అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ :
ఇక మేకర్స్ ఈ సినిమా టీజర్​కు సంబంధించిన లేటెస్ట్ అప్​డేట్​ను ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మూవీ టీజర్‌ను మార్చి 4 సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

విజయ్ VD 12 : మరోవైపు హీరో విజయ్ 'జెర్సీ' ఫేమ్​ డైరెక్టర్​ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం VD 12 అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతోంది. అయితే ఎప్పటిలాగే ఎమోషనల్​ డ్రామాతో కూడిన కథతో కాకుండా గౌతమ్​ ఈ సినిమాను గ్యాంగ్​స్టర్​ నేపథ్యంలో తీయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై రూపొందిస్తున్నారు.

దేవరకొండను చూడగానే దిల్​ రాజు కొత్త కోడలు రియాక్షన్ వైరల్​!

'రాజాసాబ్', 'ఫ్యామిలీ స్టార్'​ రిలీజ్ డేట్స్ ​- మేకర్స్ క్లారిటీ

Last Updated : Mar 3, 2024, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.