ETV Bharat / entertainment

రష్మిక బర్త్ డే- ఫ్యామిలీస్టార్ రిలీజ్- విజయ్ షాకింగ్ ఆన్సర్​! - vijay devarakonda and rashmika - VIJAY DEVARAKONDA AND RASHMIKA

Vijay Devarakonda And Rashmika : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ నేషనల్ క్రష్ బర్త్ డే రోజే విడుదల కానుంది. దీనిపై విజయ్ ఏమన్నారంటే?

vijay devarakonda and rashmika
vijay devarakonda and rashmika
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 7:18 PM IST

Vijay Devarakonda And Rashmika : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా మరి కొద్దిరోజుల్లో థియేటర్​లోకి రానుంది. వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, దిల్‌ రాజు- శిరీశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరించేలా ఉంటుందని అంచనాలు వేస్తున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్లు చేస్తోంది. అందులో భాగంగా కిట్టీ పార్టీ పేరుతో కొందరు నటీమణులతోపాటు ఫేమస్ యూట్యూబర్లతో విజయ్‌ దేవరకొండ చిట్‌చాట్‌ జరిపారు.

ఈ సందర్భంగా సినిమా విడుదల విషయంలో విజయ్‍కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల అవుతుంది కదా, ఆ తేదీన ఏదైనా విశేషం ఉందా? అని విజయ్ దేవరకొండను ఓ నటి అడిగారు. ఏప్రిల్‌ 5న ఫ్యామిలీ స్టార్‌ విడుదల చేయడానికి ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉండటమే అని విజయ్‌ దేవరకొండ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న వారు నవ్వడం ప్రారంభించారు.

అయితే ఏప్రిల్‌ 5న ఇంకేదో ఉంది, అదే రష్మిక మందన్న పుట్టినరోజు అనుకుంటా అని మరొకరు అన్నారు. 'అవును ఆరోజున రష్మిక పుట్టినరోజు ఉంది. అది మాకు లక్కీ అవుతుందని అనుకుంటున్నాను' విజయ్ తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారాయి. వాస్తవానికి ఏప్రిల్‌ 5,6,7 తేదీలు వీకెండ్‌తో ముగుస్తాయి. ఆ తర్వాత వెంటనే ఉగాది, రంజాన్‌ పండుగలు ఒకే వారంలో ఉన్నాయి. దీంతో ఫ్యామిలీ స్టార్‌కు కలెక్షన్స్‌ పరంగా బాగా కలిసొస్తుందని విజయ్‌ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ్‌- రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో రూమర్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 5వ తేదీన రష్మిక పుట్టినరోజు, సినిమా కూడా అదే రోజున విడుదల కానున్నడం ఇప్పుడు వారి ప్రేమ విషయం మరింత ఆసక్తిగా మారింది. ఫ్యామిలీ స్టార్​లో రష్మిక కనిపించనుందని కూడా వార్తలు వస్తున్నాయి. అది నిజమో కాదో చూడాలి మరి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.