Valentines Day : ప్రేమికుల రోజంటే కేవలం గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం, శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు - తమ మనసుకు నచ్చిన వాళ్లతో సమయాన్ని గడిపి ఆ రోజును ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోయేలా చేసుకోవడం కూడా. అసలు ఈ ప్రేమ అంటే ఎన్నో భావోద్వేగాల కలయిక అన్న సంగతి తెలిసిందే. హృదయంలో ఎప్పటికీ దాగుండిపోయే జ్ఞాపకాల మజిలీ. ప్రేమించిన వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు కొంతమందైతే - వారిని దక్కించుకోలేక బాధపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారు మరి కొంతమంది. దీనికి మన సినీ సెలబ్రిటీలేమీ అతీతులేమీ కాదు. మరి నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం యూత్‌లో క్రేజీ హీరోయిన్స్‌గా పేరు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్స్ తమ లవ్ లైఫ్ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.
ఇప్పటికైతే దొరకలేదు(Mrunal Thakur Love Story) : నా లవ్ లైఫ్‌లో లవ్ స్టోరీస్, హార్ట్ బ్రేక్స్ స్టోరీస్ రెండూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎదురయ్యే అనుభవాలే ఇవి. అయితే లవ్‌లో ఫెయిల్ అయినప్పుడే విలువైన విషయాలు నేర్చుకున్నాను. మన జీవితంలో నిజమైన ప్రేమ ఏది, మనకు సరిపడే సరైన వ్యక్తి ఎవరు? అనేవి ఓ సారి ప్రేమలో పడి తప్పు చేశాకే తెలుస్తుంది. ప్రస్తుతానికి నేను నిజాయితీతో కూడిన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి ప్రేమైతే ఇప్పటి వరకు దొరకలేదు అని మృణాల్ ఠాకూర్ చెప్పింది.
ప్రేమ పెళ్లే చేసుకుంటాను(Anupama Love Story) : నా దృష్టిలో ప్రేమ అనేది ఓ మధురమైన భావం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్ని చూస్తే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇది మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. నేను పెళ్లంటూ చేసుకుంటే కచ్చితంగా ప్రేమ పెళ్లే చేసుకుంటాను అని అనుపమ పరమేశ్వరన్ పేర్కొంది.
అదే నా ఫస్ట్ ప్రపోజల్ : నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. కానీ ఇప్పటికైతే నిజమైన ప్రేమ తగలలేదు. నాలుగో తరగతి చదివే రోజుల్లో మా క్లాస్‌లో ఓ అబ్బాయిపై క్రష్ ఉండేది. కొంచెం పెద్దయ్యాక ఓ అబ్బాయి నాకు ఫస్ట్ టైమ్ వాలెంటైన్ ప్రపోజల్ చేశాడు. ఊహ తెలిశాక ఓ సారి హార్ట్ బ్రేక్ అయ్యింది. వాస్తవానికి అది ప్రేమ కాదని, అట్రాక్షన్ అని తర్వాతే తెలుసుకున్నాను. హీరోల్లో అయితే నా ఫస్ట్ క్రష్ షారుక్ అని నిధి అగర్వాల్ చెప్పింది.
తొలిసారి అప్పుడే ప్రేమలో : నేను ఫస్ట్ టైమ్ లవ్‌లో పడింది మా అమ్మతోనే. ఎంతో స్వచ్ఛమైన ప్రేమది. ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఫస్ట్ క్రష్ అంటే స్కూల్ చదివే రోజుల్లోమా టీచర్‌పై ఉండేది. ప్రస్తుతానికైతే నా లైఫ్‌లో మరో ప్రేమకు చోటు లేదు అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
'అలా అని మీకు ఎవరు చెప్పారు?'-నెటిజన్‌పై రష్మిక ఫైర్
నాకు అలాంటోడే కావాలి అంటున్న శ్రీలీల - మీలో ఎవరైనా అలా ఉన్నారా?