ETV Bharat / entertainment

హారర్ జానర్​లో వరుస మూవీస్- భయపెట్టడానికి వస్తున్న మన స్టార్లు! - UPCOMING HORROR MOVIES IN TOLLYWOOD

టాలీవుడ్​లో హారర్ హవా- త్వరలో ఈ జానర్​లో రానున్న మూవీస్ ఏవంటే?

Horror Movies In Tollywood
Horror Movies In Tollywood (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 7:01 AM IST

Upcoming Horror Movies In Tollywood : ఇటీవల కాలంలో హార్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు మంచి సక్సెస్​ను అందుకుంటున్నాయి. ఈ జానర్ వెండితెరపై ఎవర్​గ్రీన్‌ హిట్‌ ఫార్ములాగా మారిపోయింది. అందుకే ఇప్పుడా భయాన్ని సినీప్రియులకు రుచి చూపించి, బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించేందుకు పలువురు హీరోహీరోయిన్లు సిద్ధమవుతున్నారు. మరి ప్రస్తుతం ఈ హారర్‌ నేపథ్య చిత్రాలతో అలరించనున్న ఆ తారలెవరు? ఆ చిత్ర విశేషాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రభాస్ మెప్పించేనా?
ప్రస్తుతం వెండితెరపై హారర్‌ నేపథ్య కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్‌లో 'ముంజ్యా', 'స్త్రీ 2' లాంటి దెయ్యాల సినిమాలు బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించాయి. ఇటీవల తెలుగులోనూ 'మసూద', 'విరూపాక్ష', 'పొలిమేర 2' లాంటి చిత్రాలు సత్తా చాటడం వల్ల కుర్రహీరోలతో పాటు బడా స్టార్లు ఆ జానర్​పై ఓ కన్నేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ చేస్తున్న 'రాజాసాబ్‌' కూడా హారర్ నేపథ్య సినిమానే. వినోదం నిండిన హారర్‌ కథాంశంతో మారుతి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

'రాజాసాబ్'లో ప్రపంచంలో మునుపెన్నడూ చూడని హారర్‌ ఉండనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఇప్పటికే తెలిపారు. అంతేకాదు కొన్ని సీన్స్‌ 'హ్యారీపోటర్‌' తరహాలో ఉన్నట్లు మరో బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక వీటన్నింటికీ తోడు ఇటీవల విడుదలైన ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకుల్లోని అంచనాల్ని మరింత పెంచేసింది. 'రాజాసాబ్'లో ప్రభాస్ మూడు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నారని, ఓ పాత్ర అందర్నీ థ్రిల్‌ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్‌ సినీప్రియుల్ని ఏ స్థాయిలో భయపెడతారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ప్రేక్షకులు వేచిచూడాల్సిందే.

వరుణ్ తొలిసారి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్​లో తొలిసారి హారర్‌ కామెడీ కథతో సినీప్రియుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమా ఈ జానర్​లోనే తెరకెక్కనుంది. పూర్తిగా రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఈ చిత్రం కోసం వరుణ్‌ ఆ యాసను స్వయంగా నేర్చుకోనున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం 'కొరియన్‌ కనకరాజు' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్​మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

'దూత'తర్వాత చైతూ కూడా
హారర్‌ మిస్టరీ థ్రిల్లర్​గా తెరకెక్కిన 'దూత' వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వేదికపై తొలి అడుగులోనే సత్తా చాటారు కథానాయకుడు నాగచైతన్య. అదే జానర్‌ సినిమాతో థియేటర్లలో అలరించేందుకు చైతూ రెడీ అవుతున్నారు. చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్‌'లో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన కార్తీక్‌ దండు డైరెక్షన్​లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది 'విరూపాక్ష' తరహాలోనే హారర్‌ అంశాలతో ముడిపడి ఉన్న మిస్టీక్‌ థ్రిల్లర్​గా రూపొందనున్నట్లు సమాచారం.

మళ్లీ అదే బ్యాక్ డ్రాప్​లో అనుష్క
టాలీవుడ్​లో హారర్‌ జానర్​తో అదరగొట్టిన హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'అరుంధతి', 'భాగమతి' ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడామె మరోసారి అదే జానర్‌లో 'కథనార్‌ - ది వైల్డ్‌ సోర్సెరర్‌'తో భయాన్ని రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. అనుష్కకు ఇదే మొదటి మలయాళ మూవీ. రోజిన్‌ థామస్‌ రూపొందించిన ఈ హారర్‌ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వీటీ బాటలో ఆ ఇద్దరూ
హారర్, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా తమన్నా నటిస్తున్న చిత్రం 'ఓదెల 2'. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించనుంది. తమన్నా ఇందులో నాగసాధువుగా కనిపించనుండగా, వశిష్ఠ ఎన్‌.సింహ భయంకరమైన రాక్షస పాత్రలో కనువిందు చేయనున్నారు. సినిమాలో వీళ్లిద్దరి పోరు అందర్నీ మెప్పిస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అలాగే స్టార్ హీరోయిన్​ రష్మిక కూడా తొలిసారి హారర్‌ నేపథ్య సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ఆదిత్య సత్పోదర్‌ 'థామా' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెండు కాలాల మధ్య సాగే భిన్నమైన హారర్‌ కామెడీ కథాంశంతో రూపొందుతున్నట్లు సమాచారం.

రొటీన్​ సినిమాలతో బోర్ కొట్టేసిందా? హారర్ వెబ్​సిరీస్​ లిస్ట్ ఇదిగో- ఎంటర్​టైన్​మెంట్ పక్కా!

OTTలో హారర్ మూవీస్ చూడాలా- బెస్ట్​ లిస్ట్​ ఇదే! - Horror Movies OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.