Trisha Krishnan Net Worth : టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా దక్షిణాది సినీ పరిశ్రమ ఏదైనా.. త్రిష సినిమా అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తన అందం, అద్బుతమైన అభినయంతో దశాబ్దాల తరబడి లీడింగ్ స్టార్‌గా కొనసాగుతూ అభిమానుల మనసులు దోచేస్తున్నారు ఈ అందాల తార.
1999లో విడుదలైన 'జోడీ'తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన త్రిష ఇప్పటి వరకూ కెరీర్లో పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. 'సామి', 'ఆరు', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే', 'పౌర్ణమి', 'బుజ్జిగాడు', 'కింగ్', 'కొడి', 'అభియూమ్, నానుమ్', 'విన్నై తాండి వరువాయా' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.
'ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన' అంటూ వర్షంతో ముచ్చటించి మురిపించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, యాక్షన్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల్లో స్పెషల్ ఈమేజ్ తెచ్చుకున్నారు. తాజాగా 'బృందా' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు.
ఒక్కో ప్రాజెక్టుకు త్రిష రెమ్యునరేషన్ ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో త్రిష నటించారు. ఇందుకుగానూ ఆమె విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ మూవీ తర్వాతే త్రిష తన రెమ్యునరేషన్ పెంచేశారని సినీ వర్గాల మాట. 'లియో' సినిమాకుగానూ ఆమె సుమారు రూ.5కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట.
నెట్‌వర్త్ ఎంతంటే?
సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న త్రిష ఆర్థికంగానూ మంచి స్థాయిలో ఉన్నారట. సౌత్ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమనుల్లో ఈమె కూడా త్రిష ఒకరని సినీ వర్గాల మాట . తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం త్రిష నెట్‌వర్త్ రూ.85కోట్లు అని సమాచారం.
ఇక సినిమాల ద్వారానే కాకుండా పలు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రమోషనల్ పోస్టుల ద్వారా కూడా త్రిష సంపాదిస్తున్నారట. పలు మీడియా కథనాల ప్రకారం ఆమె కేవలం వీటి ద్వారానే ఏడాదికి దాదాపు రూ. 9కోట్ల ఆదాయాన్ని గడిస్తున్నారని సమాచారం.
హైదరబాద్‌లోని ఓ విలాసవంతమైన బంగ్లాలో ఆమె నివసిస్తోంది. దీని విలువ ప్రస్తుతం రూ.6కోట్లు ఉంటుందని సమాచారం. ఇదేకాకుండా ఈమెకు చెన్నైలోనూ దాదాపు రూ.10కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని త్రిష లగ్జరీ వాహనాల సేకరణలో ఖర్చు చేస్తుందని సమాచారం. ఆమె దగ్గర రూ. 80లక్షల విలువైన మెర్సిడీస్-బెంజ్ ఎస్-క్లాస్, రూ.75లక్షల విలువైన బీఎండబ్ల్యూ-5 సిరీస్, రూ.60లక్షలు విలువైన రేంజ్‌రోవర్ ఎవోక్లతో పాటు మెర్సిడెస్ బెంజ్-E కూడా ఉన్నాయట.
త్రిషకు అదంటే బాగా పిచ్చి - లేకుండా అస్సలు ఉండలేదట! - Happy Birthday Trisha