ETV Bharat / entertainment

టాలీవుడ్​లో కొత్త కలయికలు - ఇప్పుడందరి ఆసక్తి వీటిపైనే - Tollywood Upcoming Movies - TOLLYWOOD UPCOMING MOVIES

Tollywood Upcoming Movies : ఒకప్పుడు స్టార్ హీరోలు కొత్త దర్శకులతో పనిచేసేందుకు కాస్త ఆలోచించేవారు. సీనియర్ దర్శకులకే ఎక్కువగా మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడా లెక్కలు మారిపోయాయి. ఇమేజ్‌ సంకెళ్లను తెంచేసుకుని అనుభవాల లెక్కలను పక్కకు పెట్టి కొత్తతరం దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు బడా హీరోలు. ఫలితంగా ఇండస్ట్రీలో కొత్త, తొలి కలయికలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ వారెవరో తెలుసుకుందాం.

టాలీవుడ్​లో కొత్త కలయికలు - ఇప్పుడందరి ఆసక్తి వీటిపైనే

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 7:42 AM IST

Tollywood Upcoming Movies : సక్సెస్​ఫుల్ కాంబోలకు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్‌పై ముస్తాబవుతున్న పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో ఇలాంటి కాంబోలే. అయితే వీటికి పోటీగా అదే స్థాయిలో అంచనాలు పెంచుతున్న తొలి కలయికలూ ఇప్పుడు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని సెట్స్​పైకి వెళ్లగా మరికొన్ని సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ తొలిసారి జట్టు కట్టి ఇంట్రెస్ట్​ క్రియేట్ చేస్తున్న ఆ కాంబోలు ఏంటో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీలో ఎక్కువగా యువ దర్శకులతోనే పని చేస్తున్నారు. సైరా నరసింహరెడ్డి, గాడ్‌ఫాదర్‌, వాల్తేరు వీరయ్య ఈ కోవకే చెందినవి. ఇప్పుడు వశిష్ఠతో విశ్వంభర చేస్తున్నారు. బింబిసార విజయం తర్వాత వశిష్ఠ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. అంజి తర్వాత ఇన్నేళ్లకు చిరు మళ్లీ ఈ తరహా కథలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ తర్వాత దాదాపు అరడజను మందికి పైగా దర్శకులు చిరు కోసం కథలతో రెడీగా ఉన్నారట. వారిలో మారుతి, హరీశ్‌ శంకర్‌, అనుదీప్‌, కల్యాణ్‌ కృష్ణ, త్రినాథరావు నక్కిన తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటారు నాగార్జున. ఇప్పుడాయన శేఖర్‌ కమ్ములతో కుబేర చేస్తున్నారు. దీని తర్వాత ఆయన తమిళ యువ దర్శకుడు నవీన్​తో చేయనున్నారట. అలానే సుబ్బు అనే మరో కొత్త దర్శకుడితోనూ చేయనున్నారని తెలుస్తోంది.

ప్రభాస్​ నాగ్‌అశ్విన్​తో కల్కి 2898ఎ.డి, మారుతితో రాజాసాబ్‌, సందీప్‌రెడ్డి వంగాతో స్పిరిట్‌ ఇలా తెరకెక్కుతున్న సినిమాలన్నీ తొలి కలయికే. నెక్స్ట్​ హను రాఘవపూడితో చేయనున్నారట. ఓ ఫిక్షనల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందనుందట.

ప్రస్తుతం వరుసగా కొత్త కలయికల్ని ఖరారు చేస్తూ దూసుకెళ్తున్నారు రవితేజ, నాని. ప్రస్తుతం రవితేజ చేస్తున్న మిస్టర్‌ బచ్చన్‌, ఆ మధ్య చేసిన వాల్తేరు వీరయ్య తప్పా ఈ మధ్యలో వచ్చినవన్నీ తొలి కలయికల్లో రూపొందినవే. త్వరలోనే భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితోనూ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం.

నాని ప్రస్తుతం సరిపోదా శనివారం చేస్తున్నారు. దీని తర్వాత సుజీత్‌ దర్శకత్వంలో, బలగం వేణు దర్శకత్వంలో చిత్రాలు చేయనున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి మహేశ్‌బాబుతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇది కూడా తొలి కలయికే. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

స్టార్ హీరో బాలకృష్ణ దర్శకుడు బాబీతో కలిసి ఎన్​బీకే 109 చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరితో ఓ స్పై థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ - సుజీత్‌ల ఓజీ, పవన్‌ - క్రిష్‌ల హరిహర వీరమల్లు, రామ్‌చరణ్‌ - బుచ్చిబాబుల కాంబో, వరుణ్‌తేజ్‌ - కరుణ కుమార్‌ల మట్కా అన్నీ కొత్త కలయికలే. ఇంకా అల్లు అర్జున్‌ - అట్లీ, వరుణ్‌తేజ్‌ - మేర్లపాక గాంధీ, నాగచైతన్య - కార్తీక్‌ దండు కాంబోలు కూడా సిద్ధమవుతున్నాయి.

'కాల్పులు జరిపింది మేమే, ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు!'- సల్మాన్​కు మరో వార్నింగ్ - Salman Khan Threatened

బ్రాండ్ ఎండార్స్​మెంట్స్​కు రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్! - ప్రీతీ నెట్​వర్త్​ ఎంతంటే ? - Preity Zinta Net Worth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.