ETV Bharat / entertainment

'నా పేరు వెనక అసలు కథ ఇదే' - టైగర్​ అని ఎందుకంటారంటే? - Tiger Jackie Shroff - TIGER JACKIE SHROFF

Tiger Jackie Shroff: బాలీవుడ్​లో కండల తిరిగే బాడీ, యాక్షన్​తో అదరగొడుతున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. ఆయన అక్షయ్ కుమార్​తో కలిసి నటించిన సినిమా 'బడే మియా ఛోటే మియా'. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సినిమా ప్రమోషన్​లో ష్రాఫ్ తన పేరులో టైగర్ ఎందుకు, ఎలా వచ్చిందో చెప్పారు.

Tiger Jackie Shroff
Tiger Jackie Shroff
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 9:30 PM IST

Updated : Apr 12, 2024, 6:13 AM IST

Tiger Jackie Shroff: వైవిధ్యభరితమైన యాక్షన్‌ స్టోరీలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌. తనదైన నటన, మంచి బాడీని మెయింటెన్ చేస్తూ కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్​తో కలిసి 'బడే మియా ఛోటే మియా ' సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న గ్రాండ్​గా విడుదలైందీ సినిమా. దీంతో హీరోలు టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్లలో టైగర్ ష్రాఫ్ తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అసలు తన పేరులో 'టైగర్' పదం ఎలా వచ్చిందో చెప్పారు.

తన అసలు పేరు జై హేమంత్ ష్రాఫ్ అని బయటపెట్టారు టైగర్ ష్రాఫ్. ఆ పేరునే తన తల్లిదండ్రులు జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ పెట్టారని చెప్పుకొచ్చారు. మరి టైగర్ అని పేరు ఎలా వచ్చిందని ఇంటర్వ్యూలో అడగ్గా అప్పుడు తన పేరు వెనక ఉన్న అసలు సంగతి వెల్లడించారు. తన చిన్నతనంలో మనుషులను కొరకడం(కరవడం) వల్లే తనకు టైగర్ అనే పేరు వచ్చిందని వివరించారు. ' నా బాల్యంలో చాలా మందిని కొరికేవాడిని. అందుకే నాకు టైగర్ అనే పేరు వచ్చింది. నా తండ్రి జాకీ ష్రాఫ్ అసలు పేరు జై కిషన్. మా మాయయ్య పేరు హేమంత్. అందుకే నాకు మా తల్లిదండ్రులు జై హేమంత్ ష్రాఫ్ అని పేరు పెట్టారు. నన్ను చిన్నప్పటి నుంచి అందరూ టైగర్ అని పిలిచేవారు. అందుకే సినిమాల్లోకి వచ్చాక కూడా నా పేరు ముందు టైగర్ అనే పెట్టుకున్నాను.' అని టైగర్ ష్రాఫ్​ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అక్షయ్ కుమార్​ను తన పేరును మార్చుకోవడం గురించి అడగ్గా ఆయన సరదాగా బదులు ఇచ్చారు. రాజీవ్ హరిఓం భాటియాగా ఉన్న తన పేరును అక్షయ్ కుమార్​గా మార్చడం వెనుక ఏదో ఉందని, కానీ దానిని పంచుకోలేనని అక్షయ్ చెప్పుకొచ్చారు. అయితే పేరు మార్పు వెనుక జోతిష్యం మాత్రం లేదని చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నాటు నాటు' బీటౌన్ వెర్షన్​ - ఆ సాంగ్​కు హుక్​ స్టెప్​ వేసిన అక్షయ్​, టైగర్​

పాన్ మసాలా యాడ్​లో ఆ ముగ్గురు స్టార్స్ - షాకిచ్చిన అలహాబాద్​ హైకోర్టు

Last Updated : Apr 12, 2024, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.