ETV Bharat / entertainment

థియేటర్స్ బంద్​పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన - అందులో నిజం లేదంటూ - TFPC On Theatres Bandh - TFPC ON THEATRES BANDH

Telugu film producers council On Theatres Bandh : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత అవాస్తవమని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. థియేటర్ల మూసివేతపై సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు. Source ETV Bharat

Source ETV Bharat
Theatres (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 8:28 PM IST

Telugu film producers council On Theatres Bandh : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత అవాస్తవమని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. థియేటర్ల మూసివేతపై సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ మేరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీతో సంబంధం లేకుండా ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. థియేటర్ యజమానులు కానీ ఇతర అసోసియేషన్ల నుంచి ఎవరు నిర్మాతల మండలికి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

తక్కువ వసూళ్లు రావడంతో కొందరు యజమానులు వ్యక్తిగత నిర్ణయం తీసుకొని థియేటర్లను మూసివేశారని, దానికి నిర్మాతల మండలికి సంబంధం లేదని ప్రసన్నకుమార్ తెలిపారు. ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్ లు సినిమా ఆదాయంపై ప్రభావం చూపడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోయారని, అందువల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ యజమానులు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని ప్రదర్శనలు ఆపేశారని వివరించారు.

"గుంటూరు సహా ఏపీలోని పలువురు సినిమా థియేటర్ల యజమానులు కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, దీంతో డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు చెల్లించలేకపోతున్నారన్న కారణాన్ని చూపుతూ సినిమా ప్రదర్శనలు నిలిపివేసినట్టు మా దృష్టికి వచ్చింది. తెలంగాణలోనూ కొందరు థియేటర్ల యజమానులు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఎన్నికలు, ఐపీఎల్‌ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఓ అసోసియేషన్‌ వల్లే థియేటర్లు మూతపడ్డాయంటూ వస్తున్న వార్తలను మేం ఖండిస్తున్నాం. సినిమా థియేటర్ యజమానులుగానీ, మరే ఇతర అసోసియేషన్‌గానీ అపెక్స్ బాడీలకు (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి) ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కాబట్టి థియేటర్లు బంద్‌ అనే ప్రచారంలో నిజం లేదు. మా సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తాయి" అని ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో అప్పటివరకు సినిమా ప్రదర్శనలు నిలిపివేత - TELANGANA THEATRES BANDH

థియేటర్ల బంద్​తో బోరింగా? - OTTలో ఉన్న ఈ 12 క్రేజీ సినిమా/సిరీస్​లు మీకోసమే! - Telangana Theatres Close

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.