ETV Bharat / entertainment

అవును తాప్సీ, మాథియాస్ ఒక్కటయ్యారు! - Taapsee Pannu Marriage Video - TAAPSEE PANNU MARRIAGE VIDEO

Taapsee Pannu Marriage Video : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మాథియాస్ బో ను ఆమె పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Taapsee Pannu Marriage Video
Taapsee Pannu Marriage Video
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 10:11 PM IST

Taapsee Pannu Marriage Video : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మాథియాస్ బో ను ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఈ అమ్మడి పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎక్కడ కనబడలేదు. కానీ తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందులో పెళ్లికూతురు గెటప్​లో కనిపించింది తాప్సీ. తన ప్రియుడు దగ్గరికి డ్యాన్స్​ చేసుకుంటూ వెళ్లింది.

ఇక పంజాబీ స్టైల్​లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి అవుట్​ఫిట్ చూస్తుంటే ఈ విషయం తెలుస్తోంది. వీరిద్దరు పెద్దలను ఒప్పించి మార్చి 23న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు రాలేదు. తాప్సీ కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టలేదు.

అయితే ఈ పెళ్లి ఎప్పుడో జరిగినట్లు సమాచారం. మార్చి 24న ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగినట్లు సమాచారం. తాప్సీ నటించిన తప్పడ్ సినిమాలోని సహనటుడు పవైల్ గులాటీ, క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అభిలాష్ తాప్లియాల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా దిల్లోన్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వరుడు తరఫున సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పెళ్లికి విచ్చేసినట్లు సమాచారం.

ఇక పెళ్లి వేడుక గురించి నేరుగా చెప్పకపోయినప్పటికీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులతో అభిమానులకు హిట్ ఇస్తూనే ఉన్నారు తాప్సీ - మాథియాస్. పెళ్లికి ముందే హోలీ వేడుకలోనూ వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అభిలాష్ తాప్లియాల్.

ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే :
తాప్సీ, మాథియాస్, 2013 ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవంలో తొలిసారి కలిశారు. లఖ్​నవూ టీమ్ అయిన అవాధె వారియర్స్‌లో ప్లేయర్​గా మాథియాస్ ఉంటే, అదే లీగ్​లోని హైదరాబాద్ టీమ్​కు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరించింది తాప్సీ. అలా కలిసిన ఈ జంట దాదాపు పదేళ్లు పాటు లవ్​లో ఉన్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.

'బ్రేకప్​ చెప్పాలని అనుకోలేదు - పెళ్లి విషయంలో నా అభిప్రాయం వేరు'

స్కూల్​ సీనియర్​తో ప్రేమలో పడ్డ తాప్సి- చదువు డిస్టర్బ్​ అవుతుందని బ్రేకప్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.