Sonakshi Sinha Salman Khan Marriage : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవలే తన బాయ్ప్రెంఢ్ జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది జూన్ 23న ముంబయిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సొనాక్షి తన తల్లి పూనమ్ సిన్హా ఆమె వెడ్డింగ్‌కు ధరించిన చీర, నగలను వేసుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అయితే వీరి పెళ్లి గురించి అనేకమంది నుంచి వ్యతిరేకం వచ్చింది. సోషల్ మీడియా వేదికగా పలువురు వీరిని దారుణంగా ట్రోల్ చేశారు. అంతకుముందు కూడా వీరి పెళ్లి గురించి అనేక రూపర్స్ సైతం వచ్చాయి. అయితే ఈ జంట వాటిని లెక్కచేయకుండా తమ అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో తెలియజేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పెళ్లి టాపిక్ గురించి మాట్లాడిన సోనాక్షి, తాను వివాహం చేసుకోవడానికి కారణం సల్మాన్ ఖాన్ అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ పెళ్లికి ఆయనకూ పరోక్షంగా సంబంధం ఉందని పేర్కొంది. ఈ మాటకు నెటిజన్లు ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే సోనాక్షి దీని గురించి క్లారిటీ ఇచ్చింది.
2017 జూన్ 23న 'ట్యూబ్‌లైట్' సినిమా స్క్రీనింగ్ సమయంలో సోనాక్షి, జహీర్ ఇఖ్బాల్ తొలిసారి కలుసుకున్నారట. అది సల్మాన్ ఖాన్ నటించిన సినిమా. స్క్రీనింగ్ పూర్తయ్యాక జరిగిన పార్టీలో కొద్ది గంటల పాటు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటానిక అది ఒక కారణమైందని సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. అనేక కన్ఫ్యూజన్ తర్వాత ఈ జంట ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే తేదీన అంటే 2024 జూన్ 23న పెళ్లి బంధంగా మారిందని సోనాక్షి క్లారిటీ ఇచ్చింది.
ఇంకో ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే ఈ ఇద్దరూ ఓ సినిమాలో నటించారు కూడా. 2022లో వచ్చిన 'డబుల్ XL' అనే చిత్రంలో స్క్రీన్‌షేర్ చేసుకున్నారు. ఎప్పుటినుంచో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పటికీ తమ లవ్ మ్యాటర్ బయటపెట్టలేదు ఈ జంట.
ఇకపై హాస్పిటల్ వెళ్లను - ప్రెగ్నెంట్ రూమర్స్‌పై సొనాక్షి రిప్లై
సింపుల్ వెడ్డింగ్‌లో ఒక్కటైన సొనాక్షి, ఇక్బాల్ - పెళ్లి ఫొటోలు చూశారా? - Sonakshi Sinha Marriage