ETV Bharat / entertainment

ఆ విషయంలో షారుక్​ ఖాన్‍ను బీట్​​ చేసిన శోభిత ధూళిపాళ్ల - Sobhita Dhulipala Sharukh Khan - SOBHITA DHULIPALA SHARUKH KHAN

IMDb Popular Indian Celebrities List : ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల లిస్ట్​లో బాలీవుడ్ బాద్‍షా షారుక్​ ఖాన్‍ను బీట్​​ చేసింది శోభిత ధూళిపాళ్ల. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI and Getty Images
Sharukh Sobhita (source ANI and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 6:48 AM IST

Updated : Aug 13, 2024, 11:39 AM IST

IMDb Popular Indian Celebrities List : టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ గత గురువారం(ఆగస్టు 8) జరిగిన సంగతి తెలిసిందే. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా జరిగిన ఈ సడెన్​ ఎంగేజ్‍మెంట్ తర్వాత శోభిత మరింత హాట్​ టాపిక్​గా మారింది. ఆమె గురించి చర్చలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో ఈ వారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల లిస్ట్​లో దూసుకెళ్లింది శోభిత ధూళిపాళ్ల.

షారుక్​ను బీట్​ చేసి - ఈ లిస్ట్​లో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ అగ్ర స్థానంలో నిలిచింది. ముంజ్యా మూవీ సక్సెస్ తర్వాత శార్వరీ క్రేజ్​ బాగా పెరిగింది. ఇక చైతన్యతో ఎంగేజ్‍మెంట్ తర్వాత శోభిత కూడా టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది. దీంతో ఆమె ఈ పాపులర్ సెలబ్రిటీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక బాలీవుడ్ బాద్​ షా షారుక్​ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. అలా షారుక్​ను బీట్ చేసింది శోభిత.

టాప్-10లో ఎవరెవరున్నారంటే? - ఈ జాబితాలో ఇంకా బాలీవుడ్​ సీనియర్ నటి కాజోల్, యంగ్​ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. పారిస్ ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, బాలీవుట్ నటి దీపికా పదుకొణె, మహారాజతో బ్లాక్​ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ ఈ టాప్-10లో చోటు సంపాదించుకున్నారు.

ఇకపోతే శోభిత ధూళిపాళ్ల విషయానికొస్తే చివరిగా ఆమె మంకీ మ్యాన్ చిత్రంలో నటించింది. అలానే డిస్నీ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్​ అవుతున్న ది నైట్ మేనేజర్​లోనూ కనిపించింది. ఈ రెండు ప్రాజెక్ట్​లు మంచి రెస్పాన్సే అందుకున్నాయి. ప్రస్తుతం సితార అనే బాలీవుడ్​ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్​లను కూడా అనౌన్స్ చేయనుంది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటీ దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తోంది.

సమంతకు మ్యారేజ్‌ ప్రపోజల్‌ - ఓకే చెప్పిన హీరోయిన్‌! - Samantha Marriage Proposal

నాగచైతన్య- శోభిత పెళ్లి ఎప్పుడు? నాగార్జున రిప్లై ఇదే! - Naga Chaitanya Sobhita

Last Updated : Aug 13, 2024, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.