ETV Bharat / entertainment

షారుక్ బాటలోనే వారసులు - ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా? - Shahrukh Khan Kids Networth - SHAHRUKH KHAN KIDS NETWORTH

షారూఖ్ ఖాన్ పిల్లలకు రూ.59కోట్ల విలువైన ఆస్తులున్నాయి. తండ్రి సంపాదనపై ఆధారపడకుండా వాళ్లే కోట్లు సంపాదిస్తున్నారు. ఇంతకీ సుహానా, ఆర్యన్ ఖాన్ ను ఏం చేస్తారు..? అన్ని కోట్లు ఎలా సంపాదిస్తారు..?

Shahrukh Khan Kids Networth
Suhana Khan, Aryan Khan (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 10:45 AM IST

Updated : Jul 31, 2024, 10:54 AM IST

Shahrukh Khan Kids Networth : బాలీవుడ్ బాద్ షా షారుక్​ ఖాన్ కోట్లకు అధిపతి అన్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా హిందీ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్​గా రాణిస్తున్న ఈ నటుడు కేవలం సినిమాల ద్వారా కాకుండా పలు బిజినెస్​ ద్వారా ఆదాయం గడిస్తుంటారు. తాజా నివేదిక ప్రకారం, షారుక్ నికర విలువ ప్రస్తుతం రూ.6,300కోట్లు. ముంబయిలోని మన్నత్​లో ఆయన తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

2001లో రూ.13 కోట్లు పెట్టి పంచశీల్ పార్కులో 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. అంతేకాదు, న్యూయార్క్, దుబాయ్, ముంబయి, లండన్, లాస్ ఏంజీల్స్, అలీబాగ్, దిల్లీ ప్రాంతాల్లో విలాసవంతమైన స్థలాలు, ఇళ్లను కొనుగోలు చేశారు.ఇప్పుడు షారుక్ పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునేందుకు వివిధ వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.

ఇటీవలే ఆర్యన్ ఖాన్ యూనివర్సిటీ ఆఫ్ సదర్ కాలిఫోర్నియాస్ స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈ నైపుణ్యంతోనే D'yavol X పేరుతో తన సొంత స్ట్రీట్ బ్రాండ్​ను ప్రారంభిచాడు. సినీ పరిశ్రమలోనూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ఓ షోకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవే కాకుండా తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ వివిధ వ్యాపార రంగంలోకి ప్రవేశించాడు. ఆర్యన్ ఈ మధ్యే పంచశీల్ పార్క్ భవనంలో రూ.37కోట్లు ఖర్చు పెట్టి రెండు అంతస్తులను కొనుగోలు చేసినట్లు ప్రముఖ మీడియా ఛానల్ విడుదల చేసిన నివేదికలో తెలిసింది.

ఇక బాద్​షా ముద్దుల తనయ సుహానా ఖాన్ విషయానికొస్తే 2023లో 'ది ఆర్చీస్' అనే హిందీ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సుహానా. అయితే ఇండస్ట్రీలోకి రాకముందే ఈ అమ్మడు వ్యాపార రంగంలోకి కాలు మోపింది. కొన్ని మీడియా వర్గాస నివేదికల ప్రకారం థాల్​లోని రూ.12.91కోట్లు విలువైన ఆస్తిని కొనుగోలు చేసిందట. వీటితో పాటు మరిన్ని ప్రాపర్టీస్​ను కూడా ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం.

'లైగర్​' బ్యూటీపై ఆర్యన్​ ఖాన్​కు అంత కోపమా?

షారుక్​ కూతురు సుహానా ఖాన్‌ ఆస్తుల విలువెంతో తెలుసా? - Suhana Khan Net Worth

Last Updated : Jul 31, 2024, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.