Shahid Kapoor Latest Interview : తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు చేయనప్పటికీ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు ఇక్కడ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన లుక్స్, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు ఈ స్టార్ హీరో. ఇప్పటికే బీటౌన్‌లో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న షాహిద్ 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా షాహిద్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూనే కొందరు హీరోల లుక్స్‌పై కామెంట్ చేశారు.
"కొందరు స్టార్స్ తాము నటించే ప్రతీ సినిమాలో దాదాపు ఒకే లుక్‌తో కనిపిస్తారు. నేను మాత్రం డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించేందుకే ఇష్టపడతాను. ఆయా రోల్ డిమాండ్ మేరకు ఏదైనా చేస్తాను" అని పేర్కొన్నారు. ఆ తర్వాత 'హౌజ్‌పార్టీకి ఎవరిని ఇన్వైట్ చేస్తారు?' అని హోస్ట్ అడగ్గా, దానికి కృతి సనన్, కియారా ఆడ్వాణీ పేర్లు చెప్పారు. ఇలా యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చి సందడి చేశాడు.
Shahid Kapoor Career : ఇక షాహిద్ కెరీర్ విషయానికి వస్తే 'కబీర్‌సింగ్', 'జెర్సీ', 'బ్లడీ డాడీ' లాంటి సినిమాల్లో మెరిసిన షాహిద్, తాజాగా 'తేరీ బాతోంన్ మే ఐసా ఉల్జా జియా'తో ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్నారు. అమిత్ జోషి, ఆరాధన సాహ్ సంయుక్తంగా ఈ సినిమాకు డైరెక్టర్లుగా వ్యవహించారు.
సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో షాహిద్ ఓ రోబో సైంటిస్ట్‌గా, కృతి సనన్ రోబోగా నటించి, మెప్పించారు. రోబోని ప్రేమించిన సైంటిస్ట్ పరిస్థితేంటి? అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించడంపై షాహిద్ ఆనందం వ్యక్తంచేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"కొన్నాళ్లుగా నేను ఫుల్ లెంత్ లవ్ స్టోరీల్లో నటించడం లేదు. ఒకే రకమైన సినిమాలు చేస్తున్న తరుణంలో నాకు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించింది. అప్పుడే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. చాలా డిఫరెంట్ స్టోరీ ఇది" అని షాహిద్ అన్నారు.
ఇంజనీర్- రోబోల మధ్య రొమాన్స్..! క్రేజీ కాన్సెప్ట్‌తో బాలీవుడ్ చిత్రం