ETV Bharat / entertainment

'పొలిమేర 3' షో బిగిన్స్​- వీడియో గ్లింప్స్ ఔట్ - POLIMERA 3 Glimpse - POLIMERA 3 GLIMPSE

Polimera 3 Glimpse: టాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్ 'మా ఊరి పొలిమేర' సిరీస్ నుంచి మూడో భాగం అప్డేట్ వచ్చింది. బుధవారం ఈ సినిమా గ్లింప్స్ రిలీజైంది.

Polimera 3 Glipms
Polimera 3 Glimpse (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 12:13 PM IST

Updated : Jul 10, 2024, 1:36 PM IST

Polimera 3 Glimpse: టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్- విశ్వనాథ్ కాంబోలో తెరకెక్కిన 'పొలిమేర' సిరీస్ సినిమాలు మంచి విజయం దక్కించుకున్నాయి. అయితే ఈ సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్​కు త్రీక్వెల్ (మూడో భాగం) కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో త్రీక్వెల్ గురించి సాలిడ్ అప్డేట్ ఇస్తూ మేకర్స్ ఓ వీడియో గ్లింప్స్​ను బుధవారం రిలీజ్ చేశారు.

అయితే ఈ మూడో భాగం కూడా సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ జానర్​లోనే తెరెకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలిసిపోతుంది. బబ్లూ పృథ్వీరాజ్​ డైలాగ్​తో గ్లింప్స్ ప్రారంభమౌతుంది. వీడియోలో సత్యం రాజేశ్, గెటప్ శ్రీను కనిపించారు. క్షుద్ర పూజలతో సత్యం రాజేశ్​ను కాస్త హార్రర్​గా చూపించారు. ఇక కథకు తగ్గట్లుగా బ్యాక్​గ్రౌండ్​లో మ్యూజిక్​ అదరగొట్టేశారు. కాగా, గతంలో రెండు పార్ట్​లలో ఉన్న నటీనటులతోపాటు ఈ త్రీక్వెల్​లో మరికొంత మంది కొత్తగా చేరారు. ఇక స్క్రిప్ట్ పూర్తైందట. ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక సత్యం రాజేశ్​తోపాటు నటుడు బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, పృథ్వీరాజ్, రాకెందు మౌలి తదితరులు సినిమాలో ఆయా పాత్రలు పోషిస్తున్నారు. వంశీ నడిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై వంశీ, భోగేంద్ర గుప్త సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు గ్యానీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

కాగా, కరోనా కారణంగా 'పొలిమేర- 1' ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో ఈ సినిమా నెమ్మదిగా పికప్ అయ్యింది. ఈ భాగంలో ట్విస్ట్‌లతో స్టోరీని ఇంట్రెస్టింగ్​గా మలిచి హిట్ టాక్ అందుకున్నారు. ఇక గతేడాది ఈ సినిమా రెండో భాగం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చేతబడి కాన్సెప్ట్​తో తెరకెక్కిన సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ఇక నటులు సత్యం రాజేశ్, బాలాదిత్య నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ చిత్రం మూడో భాగంపైన అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఊహించని ట్విస్ట్​లతో 'మా ఊరి పొలిమేర-2', మరి భయపెట్టిందా?

Maa Oori Polimera 2 Movie : ఈ సారి ఎనిమిది ట్విస్టులతో.. అస్సలు ఊహించని విధంగా..

Last Updated : Jul 10, 2024, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.