ETV Bharat / entertainment

బాలీవుడ్​లో బిజీబిజీగా సమంత- మరో వెబ్​సిరీస్​లో ఛాన్స్​- ఈసారి యువరాణిగా! - SAMANTHA UPCOMING SERIES

బాలీవుడ్ ప్రాజెక్ట్​లతో బిజీబిజీగా సమంత- మరో వెబ్​సిరీస్​లో ఛాన్స్​- యువరాణిగా కనిపించనున్న హీరోయిన్​

Samantha Upcoming Series
Samantha Upcoming Series (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 3:41 PM IST

Samantha Upcoming Series : స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్​లో పలు ప్రాజెక్ట్​లతో బిజీగా ఉంది. అయితే సినిమాలు కాకుండా ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్​సిరీస్​లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సిటాడెల్: హన్నీ బన్నీ' (Citadel Honey Bunny) నవంబర్ రెండో వారంలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్​ ప్రమోషన్స్​ ప్రారంభించారు.

ఈ వెబ్​సిరీస్​ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్‌ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సిరీస్​ రిలీజ్ అవ్వకముందే సమంత మరో భారీ ప్రాజెక్ట్​లో ఆఫర్ పట్టేసిందని వార్తలు వస్తున్నాయి. అది కూడా బాలీవుడ్​కు చెందిన వెబ్​సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతోంది. ప్రముఖ డైరెక్టర్​ రాజ్ అండ్ డీకే (Raj And DK) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ రాజవంశ కుటుంబం నేపథ్యంలో ఈ వెబ్​సిరీస్​ రూపొందుతోంది. రాజ్యం కోసం కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటాలు, రాజకీయ అంశాలలో ఈ కథ సాగనుంది. ఈ సిరీస్​లో ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ (Aditya Roy Kapoor and Ali Fazal) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరు యువ రాజులుగా కనిపించనున్నారు. అలాగే ఈ సిరీస్​లో సమంత యువరాణి పాత్ర పోషించనున్నట్లు ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ కథను ముందుగా సినిమా రూపంలోనే తీసుకురావాలని మేకర్స్ భావించారట. కానీ, స్టోరీ పెద్దదిగా ఉండడం వల్ల వెబ్​సిరీస్​గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమైంది. త్వరలోనే సమంతకు సంబంధించిన క్యారెక్టర్ షూటింగ్ కూడా షురూ కానుంది. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ వామికా గబ్బి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా బాలీవుడ్​కు చెందిన బడా స్టార్లు కూడా ఈ సిరీస్​లో భాగం కానున్నారని టాక్. కాగా, 2025లో దీన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది.

'అది ఎలా చేశానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే' - సమంత

ఆ భయం ఉంది - అందుకే హిందీ భాష మాట్లాడను : సమంత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.