Prasanth Neel Vijay Devarkonda Movie : ఫిల్మ్ ఇండిస్ట్రీలో చాలా కాంబోల పేర్లు వినిపిస్తుంటాయి. కానీ అన్నీ సెట్స్‌పైకి వెళ్లవు. ఒకవేళ వెళ్లినా అన్నీ తెరపైకి రావు. కొన్ని మాత్రమే సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే తాజాగా మరో కొత్త కాంబినేషన్ పేరు వినిపిస్తోంది. అదే విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ రెండు పేర్లు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారని, విజయ్ వ్యక్తిగత సిబ్బందిని కలిశారని ప్రచారం సాగుతోంది. అలానే త్వరలోనే వీరిద్దరి కలయికలో ఓ పాన్ ఇండియా మూవీ చూడొచ్చని అంటూ కథలు అల్లేస్తున్నారు. కానీ వాస్తవానికి జరిగింది వేరని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలీయలేదు కానీ సినిమా మాత్రం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ లైనప్ పెద్దగా ఉంది. ప్రాక్టిగల్గా ఆలోచిస్తే ఆ లైనప్‌తోనే ఆయనకు 2026 దాటేస్తోంది. ప్రస్తుతం ఆయన సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం మొదలు పెట్టాల్సి ఉంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు అన్ని కలిపి ఇంకో ఆరు నెలల సమయం పట్టొచ్చు. ఇది పూర్తవ్వడానికి ఏడాదికి పైగానే పడుతుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలి. ఇది కూడా మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. అనంతరం రామ్ చరణ్‌తో ఓ సినిమా పెండింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కాబట్టి ఇదంతా పూర్తయ్యేసరికి చాలా కాలమే పడుతుంది. కాబట్టి ఇప్పట్లో ప్రశాంత్ నీల్ - విజయ్ దేవరకొండ సినిమా ఉండకపోవచ్చు. ఇకపోతే విజయ్ దేవరకొండ మార్కెట్ వరుస ఫ్లాపులతో కాస్త స్లోగా ఉంది. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం రౌడీ హీరో ఫోకస్ అంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే భారీ ఆశలు పెట్టుకున్న ఖుషి భారీ స్థాయిలో సక్సెస్ కాలేదు. ది ఫ్యామిలీ స్టార్ అయితే డిజాస్టర్ అయిపోయింది. ఇక కొంతకాలం క్రితం సుకుమార్‌తో చేయాల్సిన సినిమా చేజారిపోయింది!
'మలయాళ సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడానికి కారణమిదే' - Fahadh faasil
బాలయ్యను ఢీ కొట్టేందుకు సెట్లోకి అడుగుపెట్టేసిన హంటర్ - NBK 109 Villain