ETV Bharat / entertainment

సిస్టర్‌ పెళ్లిలో సాయి పల్లవి అదిరిపోయే డ్యాన్స్‌ - ఈ వీడియోలు చూశారా? - Sai Pallavi Sister Marriage - SAI PALLAVI SISTER MARRIAGE

Sai Pallavi Sister Pooja Kannan Marriage : తన సోదరి, నటి పూజా కన్నన్‌ పెళ్లి వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోదరితో కలిసి డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

source ETV Bharat
Sai Pallavi (source ETV Bharat)
author img

By ETV Bharat Entertainment Team

Published : Sep 5, 2024, 4:22 PM IST

Sai Pallavi Sister Pooja Kannan Marriage : ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ఇంట శుభకార్యం జరిగింది. ఆమె సోదరి, నటి పూజా కన్నన్‌ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఆమె తన క్లోజ్‌ ఫ్రెండ్‌ వినీత్‌తో ఏడడుగులు వేసి మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది.

అయితే ఈ వేడుకల్లో హీరోయిన్ సాయి పల్లవి పూజా కన్నన్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. అలానే సోదరితో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్‌ కూడా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన పలువురు నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్‌కు మరోసారి ఫిదా అవుతూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.

Pooja Kannan Movies : కాగా, సాయి పల్లవి సోదరిగా పూజ కన్నన్‌ కూడా చాలా మంది సౌత్‌ సినీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. కోలీవుడ్‌ మూవీ చితిరై సెవ్వానంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2021లో విడుదలైన ఈ చిత్రంలో పూజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమెపై చాలా మంది సినీ ప్రియులు ప్రశంసలు కురిపించారు. ఇకపోతే పూజ కన్నన్‌(Pooja Kannan Love Marriage) చాలా కాలం నుంచి వినీత్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరిలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలోనూ సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సోదరితో కలిసి చిందులేసింది.

Sai Pallavi Upcoming Movies : ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే, ఆమె నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'తండేల్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా నితీశ్‌ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం రామాయణ్‌లోనూ సీతగా నటిస్తోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు.

'ఆ డైరెక్టర్‌ నన్ను శృంగార బానిసగా చూశాడు' : నటి సంచలన ఆరోపణలు - Hema Committee Report

'సింబా'పై ప్రశాంత్ వర్మ మరో సూపర్ అప్డేట్‌ - నందమూరి ఫ్యాన్స్‌లో పెరిగిన జోష్‌ - Prasanth Varma Mokshagna

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.