ETV Bharat / entertainment

'గేమ్​ ఛేంజర్‌' టీజర్‌పై తమన్‌ పోస్ట్‌ - ఏంటంటే? - RAMCHARAN GAME CHANGER TEASER

Game Changer Movie Update : గేమ్ ఛేంజర్ టీజర్​ గురించి అప్డేట్ ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్!

Ramcharan  Game Changer
Ramcharan Game Changer (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 4:43 PM IST

Updated : Oct 8, 2024, 4:49 PM IST

Music Director Thaman Game Changer Movie Update : మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ - దిగ్గజ దర్శకుడు శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్‌'. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం చాలా కాలంగా మెగా ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్ర అప్డేట్స్​ గురించి ఊరిస్తున్న వస్తున్న మూవీ టీమ్​, దసరాకు టీజర్‌ విడుదల చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్​ తమన్‌ పోస్ట్‌ పెట్టారు. దీపావళికి టీజర్‌ వస్తుందని చెప్పారు.

"దసరాకు టీజర్‌ రావట్లేదని నిరాశ చెందొద్దు. ప్రస్తుతం మూవీ టీమ్​ ఆ పనుల్లోనే ఉంది. సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ ఫైనల్‌ ఎడిటింగ్‌, డబ్బింగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ పనులు ప్రారంభం అయిపోయాయి. ప్రతి నెలా ఒక లిరికల్‌ సాంగ్​ను రిలీజ్ చేయడం కోసం అన్ని సాంగ్స్​ లిరిక్స్‌ పనులను కంప్లీట్ చేశాం. ఈ నెలలో అక్టోబర్‌ 30న ఒక సాంగ్ రిలీజ్ కానుంది. సినిమా డిసెంబర్‌ 20 న కచ్చితంగా రిలీజ్ కానుంది." అని తమన్ పోస్ట్‌ పెట్టారు. ఇకపోతే ఇప్పటికే విడుదలైన 'రా మచ్చా' పాట 100 మిలియన్ల వ్యూస్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి రెడీగా ఉండండి.

ఓ నెటిజన్‌కు తమన్ బదులిస్తూ దీపావళికి టీజర్‌ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. దీని టీజర్‌ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని మేము అర్థం చేసుకోగలం. ఇది ఎంతో పెద్ద ప్రాజెక్ట్‌. ఔట్ పుట్ కోసం ఎక్కడా రాజీపడడం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్​ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దసరాకు రిలీజ్ కాకపోతే దీపావళికి టీజర్‌ విడుదల అవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్​ను నేను ఎప్పటికప్పుడు అందిస్తాను. మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అని అన్నారు.

కాగా, గేమ్ ఛేంజర్‌ సినిమా విషయానికొస్తే పొలిటికల్‌, యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమవుతోంది. సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో చరణ్​తో పాటు శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర సహా పలువురు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్​ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

పవన్ కల్యాణ్​పై బాలీవుడ్ స్టార్ యాక్టర్​ ప్రశంసలు - ఏం అన్నారంటే?

భారీ బడ్జెట్‌తో బడా హీరోల సినిమాలు - పాన్ ఇండియానే టార్గెట్!!

Last Updated : Oct 8, 2024, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.