Rajinikanth Lal Salam Collections : సూపర్ స్టార్ రజనీ కాంత్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం సమకూర్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేశారు. ఇంత స్టార్ కాస్ట్ ఉన్న ఈ చిత్రం రీసెంట్గా రిలీజై ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆడట్లేదు. రజనీ కాంత్ కెరీర్లోనే దారుణ కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తోంది!
అసలీ చిత్రాన్ని దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ. 35 కోట్ల వరకు జరిగిందట. చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలా రూ. 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. పేలవంగా ఓపెనింగ్స్‌ను అందుకుంది. తొలి రోజు తమిళంలో రూ. 3.25 కోట్లు, తెలుగులో 30 లక్షల రూపాయలు అందుకుంది. రెండో రోజు తమిళంలో రూ. 3 కోట్లు, తెలుగులో రూ. 25 లక్షలను సాధించింది.
ఇక 3వ రోజు కలెక్షన్స్ విషయానికొస్తే తమిళంలో రూ. 3 కోట్ల రూపాయలు అందుకోగా తెలుగులో రూ. 28 లక్షలు మాత్రమే సాధించింది. దీంతో ఈ చిత్రం మొత్తం మూడు రోజుల్లో రూ.11 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.15 కోట్ల రూపాయలను అందుకుంది. అంటే రజనీకాంత్ స్టామినాకు తగ్గట్టుగా లాల్ సలామ్ చిత్రం కలెక్షన్లను పుంజుకోలేకపోయాయి. ఈ సినిమా ఆక్యుపెన్సీ సుమారుగా 38 శాతంగా ఉందట. చెన్నై, కోయంబత్తూరు, పాండిచ్చేరి నగరాల్లో కాస్త పర్వాలేదనిపించేలా ఉన్నా తెలుగులో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బుల్లితెరపైకి రూ.600 కోట్ల బ్లాక్ బాస్టర్ మూవీ - తెలుగు ప్రేక్షకుల కోసం స్పెషల్‌గా!