ETV Bharat / entertainment

దటీజ్​ రాజమౌళి - ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్‌ అయిన జక్కన్న సినిమా తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 3:52 PM IST

దర్శకధీరుడు రాజమౌళికి విదేశాల్లో క్రేజ్​ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఆయన తెరకెక్కించిన ఓ సినిమాకు విదేశాల్లో టికెట్ బుకింగ్స్​ అలా ఓపెన్‌ చేయగానే ఇలా ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్ అయిపోయిందట. ప్రస్తుతం ఈ విషయం తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

Rajamouli RRR Movie Craze in Japan One minute theatre house full

Rajamouli RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్ బస్టరే అని సినీ ప్రియులు అంతా ఆశిస్తుంటారు. ఇప్పటికే ఆయన తన చిత్రాలతో తెలుగు చిత్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచారు. జక్కన్న టేకింగ్​కు కేవలం ఇండియన్ ప్రేక్షకులే కాదు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ అంతా ఫిదా అయిపోయారు. హాలీవుడ్ డైరెక్టర్స్, యాకర్స్​ కూడా జక్కన్నను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇప్పటికీ ఆయన సినిమాలు విదేశాల్లో ఎక్కడో ఓ చోట ప్రదర్శన అవుతూ సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతూనే ఉన్నాయి. అలా తాజాగా ఆయన తెరకెక్కించిన ఓ సినిమా జపాన్​లో ఇంకా హౌస్​ఫుల్​ బోర్డ్​తో రన్​ అవుతూనే ఉంది.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? జక్కన్న చివరిగా తెరకెక్కించిన చిత్రం ఆర్​ఆర్​ఆర్​. యంగ్ టైగర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్​ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్​గా ఎన్నో రికార్డులను సాధించింది. అయితే ఈ సినిమా జపాన్‌లో కూడా రిలీజైంది. అలా విడుదలైన ఈ సినిమా ఏడాదిన్నార అయినా ఇంకా రన్​ అవుతూనే ఉంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయట. ఈ విషయాన్ని ఆర్‌ఆర్ఆర్‌ తన అఫీషియల్​ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

మార్చి 18న ఈ సినిమాను వీక్షించేందుకు రాజమౌళి జపాన్‌ వెళ్తున్నారని తెలిపింది. ఇప్పటికే ఈ విషయం తెలియడం వల్ల అక్కడి ప్రేక్షకులు వేలాదిమంది టికెట్స్ కొనుగోలు చేసేందుకు రెడీ అయిపోయారట. టికెట్స్‌ బుకింగ్‌ అలా ఓపెన్‌ చేయగా ఇలా ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్ అయిపోయిందట. ఇది రాజమౌళి ఆర్‌ఆర్ఆర్‌ క్రేజ్‌ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఆర్​ఆర్​ఆర్​ జపాన్‌లో గతేడాది అక్టోబరు 21న రిలీజైంది. 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్‌ స్క్రీన్స్​పై ప్రదర్శించారు. అలాగే 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించి 300 మిలియన్‌ జపాన్‌ యెన్‌ల క్లబ్‌లోనూ చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అసూయ, బాధతో చెబుతున్నా' - ఆ కొత్త హీరోయిన్​కు ఫిదా అయిపోయిన జక్కన్న!

ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.