Pushpa 2 Box Office Collection : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోస్‌తో రన్ అవుతోంది. దీంతో ఇప్పటికే రూ.1200 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, తాజాగా 'ఆర్ఆర్ఆర్' ఓవరాల్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటివరకూ పుష్ప 2 వరల్డ్‌వైడ్‌గా రూ.1409 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ క్రమంలోనే కలెక్షన్లలో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను దాటేసింది. 2022లో రిలీజైన ఆర్ఆర్ఆర్ ఓవరాల్‌గా రూ. 1300 కోట్లు వసూల్ చేయగా, పుష్ప 11 రోజుల్లోనే ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా కొనసాగుతోంది. లాంగ్‌రన్‌లో పుష్ప వసూళ్లు ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ దంగల్ (రూ.2000 కోట్లు), బాహుబలి 2 (రూ.1800 కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥
— Pushpa (@PushpaMovie) December 16, 2024
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4
రెండో ప్లేస్‌పై కన్ను?
అయితే పుష్ప కేవలం 11రోజుల్లోనే రూ. 1400 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగానూ రికార్డ్ కొట్టింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బాహుబలి 2 కలెక్షన్లపై పుష్ప కన్నేసింది. మరో రూ.400 కోట్లు సాధిస్తే, బాహుబలి 2 ని అధిగమించి భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప నిలుస్తుంది.
ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం, తదుపరి వారం క్రిస్మస్ హాలీడేస్ ఉండడం వల్ల బాక్సాఫీస్ వద్ద పుష్ప జోరు మరో 10 రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సినిమాకు నార్త్‌లో మంచి రెస్పాన్స్ రావడం కలిసొచ్చే అంశం. హిందీలో అత్యధికంగా రూ.561.50 కోట్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా 'పుష్ప2' నిలిచింది. మరి బాహుబలి 2 కలెక్షన్లను పుష్ప బ్రేక్ చేస్తుందా? అనేది వేచి చూడాలి!
'పుష్ప 2' - ఇండియన్ సినిమాలో ఆల్‌టైమ్ రికార్డ్! - 5 రోజుల్లో రూ.922 కోట్లు
'పుష్ప రాజ్' బాక్సాఫీస్ ఊచకోత- మూడు రోజుల్లోనే రూ.600 కోట్లు క్రాస్