ETV Bharat / entertainment

గంగమ్మ జాతర ఫైటింగ్ సీక్వెన్స్​​ - వామ్మో అన్ని కోట్లు ఖర్చు చేశారా? - Pushpa 2 Teaser - PUSHPA 2 TEASER

Pushpa 2 Teaser : ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 టీజర్ గూస్​బంప్స్ తెప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచార చిత్రంలో చీరకట్టులో ఉన్న బన్నీ ఫైటింగ్ సీక్వెన్స్​ మెయిన్ హైలైట్​. ఆ సీక్వెన్స్​ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే?

చీర కట్టుకుని నటించే సీన్ కోసం బన్నీ ఎన్ని టేక్స్​ తీసుకున్నారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 12:40 PM IST

Updated : Apr 11, 2024, 12:54 PM IST

Pushpa 2 Teaser : అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పుష్ప2 టీజర్​లో బన్నీ చీరకట్టు అందరిని ఆకట్టుకుంది. గత ఏడాదే బన్నీ చీరకట్టులో ఉన్న ఫొటోను పుష్ప మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పుడే చిత్తూరులో జరిగే గంగమ్మ జాతర గురించి బోలెడన్ని చర్చలు జరిగాయి. వారం రోజులు జరిగే ఈ జాతరలో ఒకరోజు పురుషులు స్త్రీ వేషం వేస్తారు. ఇప్పుడు టీజర్​లో కూడా బన్నీ అదే లుక్​లో మరోసారి కనిపించి గూస్​బంప్స్ తెప్పించేశారు.

టీజర్​లో చీర కట్టుకుని పుష్ప స్టైల్ అండ్ స్వాగ్​తో నడవడం అభిమానులకు తెగ నచ్చేసింది. ఫైటింగ్ సీన్ అయితే గూస్​బంప్స్​ తెప్పించేసింది. సోషల్ మీడియాలో రికార్డులు కొల్లగొట్టింది. అయితే ఈ సీన్​లో బన్నీ కట్టుకున్న చీర వాళ్ల అమ్మది అని, సెంటిమెంట్ కోసం డైరెక్టర్ సుకుమార్ ఈ చీరను ఉపయోగించారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ లుక్​లో యాక్షన్ సన్నివేశాలు చేయడం బన్నీకి కాస్త కష్టం అయిందట. ఇలా చీర కట్టుకుని నటించిన ఎపిసోడ్​లో ఓ సీన్​ కోసం ఏకంగా 51 టేకులు తీసుకున్నారట బన్నీ. ఎందుకంటే ఈ సన్నివేశంలో తన యాక్టింగ్ పర్ఫెక్ట్​గా రావడం కోసం, అలానే తన నటన అందరిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే బన్నీ ఇన్ని టేకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సౌండ్ డిజైనర్​గా పనిచేస్తున్న రసూల్ పూకూట్టి కూడా అల్లు అర్జున్ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయి ప్రశంసలు కురిపించారని తెలిసింది.

రూ.50 కోట్ల సెట్ - ఇకపోతే ఈ గంగమ్మ జాతర సీక్వెన్స్ కోసం 30రోజులకు పైగానే పట్టిందట. అల్లు స్టూడియోస్​లో ఈ సెట్ వేశారట. ముంబయి నుంచి స్పెషల్ మేకప్, లైటింగ్ సెటప్స్​, ఆర్ట్ వర్క్, మోకోబాట్ కెమెరాను తెప్పించారట. ప్రొడక్షన్ కోసమే రూ.30కోట్లకుపైగా అయిందని తెలిసింది. ఇక ఇతర ఖర్చులు కూడా కలిపి ఈ సీక్వెన్స్ కోసం రూ.50 నుంచి రూ.60కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట.

కాగా, ఇప్పటికే రష్మిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆమె లుక్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. మొదటి భాగంలో మాములు మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉన్న రష్మిక రెండో భాగంలో మాత్రం నగలు వేసుకుని డబ్బున్న మహిళగా ధగధగ మెరిసిపోతూ కనిపించింది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొదట ప్రకటించినట్టుగానే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా టీజర్​తో బన్నీ అభిమానులకు సినిమా మీద అంచనాలు మరింతపెరిగిపోయాయి. మొదటి భాగంలో తన నటనకు జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ఈ రెండో భాగంతోనూ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టాలీవుడ్ నెక్ట్స్​ సెంచరీ కొట్టే హీరో అతడేనా? - Tollywood Tier 2 Heroes

వాట్​ ఏ ప్లానింగ్ 'దేవర' - ఆయన చేతికి నార్త్ థియేట్రికల్ రైట్స్​ - NTR Devara

Last Updated : Apr 11, 2024, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.