ETV Bharat / entertainment

పదో రోజూ 'పుష్ప' జోరు- ఇండియాలో తొలి సినిమాగా రికార్డ్​! - PUSHPA 2 RECORDS

రెండో వీకెండ్​లోనూ తగ్గని పుష్ప జోరు- 10వ రోజు రికార్డ్ స్థాయి వసూళ్లు

Pushpa 2 Records
Pushpa 2 Records (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2024, 4:51 PM IST

Pushpa 2 Records : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటూ అదరగొడుతోంది. సినిమా విడుదలై 10రోజులైన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు తగ్గలేదు. పదో రోజు (శనివారం) 'పుష్ప 2' సినిమా అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.100కోట్లు వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దీంతో 10వ (సెకండ్ వీకెండ్​ కూడా) రోజు రూ.100 కోట్ల మార్క్ అందుకున్న భారతీయ తొలి చిత్రంగా 'పుష్ప 2' అరుదైన రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే 'జవాన్', 'పఠాన్', 'స్త్రీ 2', 'బాహుబలి 2', 'గదర్ 2' వంటి సినిమాల బాక్సాఫీస్ రికార్డులను సైతం 'పుష్ప 2' అధిగమించింది.

అక్కడా రికార్డే
పది రోజుల్లో పుష్ప హిందీలో రూ.507.50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో అత్యంత వేగంగా హిందీ వెర్షన్ రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ సినిమాగా పుష్ప- 2 రికార్డులకెక్కింది. అలాగే అమెరికాలోనూ పుష్ప మేనియా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 12.3 మిలియన్లు కలెక్షన్లు అందుకుంది. చిత్రం విడుదలై పది రోజులు అవుతున్నా జోరు చూపిస్తూ ముందుకెళ్తోంది. ఇక వరల్డ్​వైడ్​గా ఇప్పటివరకు ఈ సినిమా రూ.1100 కోట్లకుపైనే వసూల్ చేసింది. కాగా, డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషలు, 12వేల స్క్రీన్లలో పుష్ప సినిమా రిలీజైంది.

సినిమా విషయానికొస్తే
కాగా, 2021లో విడుదలైన 'పుష్ప: ది రైజ్‌'కు సీక్వెల్‌గా 'పుష్ప 2' రూపుదిద్దుకుంది. రష్మిక మంధన్నా హీరోయిన్​గా నటించింది. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్​లో ఆడిపాడింది. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్​పై నవీన్, రవి దీనిని నిర్మించారు.

సినిమాలో అల్లు అర్జున్‌ యాక్టింగ్‌ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో ఆయన ప్రదర్శనకు ప్రేక్షకులు నిరాజనం పట్టారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్​కు బన్నీ, రష్మిక స్టెప్పులు ప్రేక్షుకుల్ని ఆకట్టుకున్నాయి.

సక్సెస్​ఫుల్​గా 'థ్యాంక్యూ ఇండియా' ప్రెస్ మీట్​ - వాళ్లకు బన్నీ ప్రత్యేక ధన్యవాదాలు

పుష్ప 2 స్క్రీనింగ్ : నో ఫస్టాఫ్, ఓన్లీ సెకండాఫ్- ఎండ్ కార్డ్ పడ్డాక అంతా షాక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.