ETV Bharat / entertainment

పునీత్ రాజ్ కుమార్ జయంతి - టాలీవుడ్​ స్టార్స్​ చిరు టు ఎన్టీఆర్​తో స్వీట్ మెమరీస్​! ​ - Puneeth Rajkumar Birth Anniversary

Puneeth Rajkumar Birth Anniversary : పవర్‌స్టార్‌ - ఈ పేరు వినగానే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది పవన్ కల్యాణ్. మరి, కన్నడిగులకు? పునీత్‌ రాజ్‌కుమార్‌. ఈయన కన్నడ హీరో అయినప్పటికీ టాలీవుడ్‌కు చాలా అంటే చాలా దగ్గర బంధువనే చెప్పాలి. తెలుగువాళ్లతో కలిసి పనిచేశారు. తెలుగు సినిమాలను రీమేక్‌లు చేశారు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే నేడు ఆయన జయంతి సందర్భంగా టాలీవుడ్ స్టార్స్​తో ఆయనకున్న బంధాన్ని ఓ సారి గుర్తుచేసుకుందాం.

పునీత్ రాజ్ కుమార్​ వర్థంతి - చిరు టు ఎన్టీఆర్​​ టాలీవుడ్​ స్టార్స్​తో స్వీట్ మెమరీస్​! ​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 8:47 AM IST

Updated : Mar 17, 2024, 9:22 AM IST

Puneeth Rajkumar Birth Anniversary : కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ చిన్న కుమారుడిగా పునీత్‌ రాజ్‌కుమార్‌ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఆయన్ను అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పేరుతోనే అభిమానుల మదిలో స్థానాన్ని సంపాదించుకున్నారు.

కేవలం సినిమాలతోనే కాదూ తన వ్యక్తిత్వంతోనూ వేలాదిమంది ప్రజల మనసును గెలుచుకున్నారు పునీత్. ఎప్పుడూ నవ్వుతూ ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే ఈయన సామాజిక సేవల్లోనూ ముందుంటారు. పిల్లలకు ఉచిత చదువు, వృద్ధుల కోసం ఆశ్రమాలు కట్టించారాయన.

ఇక టాలీవుడ్​లో పునీత్​కున్న అనుబంధం విషయానికొస్తే మొదటగా గుర్తొచ్చేది ఎన్టీఆర్​ - పునీత్ స్నేహబంధం. వీరిద్దరి మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. తారక్​ అంటే పునీత్‌కు ఎంతో అభిమానం. తన సోదరుడిగా భావిస్తారు. ఈ విషయాన్ని చాలా సార్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్​ కూడా ఎప్పుడూ బెంగళూరు వెళ్లినా అప్పు ఇంటికి తప్పకుండా వెళ్తారట. ఇక అప్పు కోసం చక్రవ్యూహ చిత్రంలో ఎన్టీఆర్‌ 'గెలియా గెలియా' అనే పాటను కూడా పాడి అలరించారు. నటసింహం బాలయ్యతోనూ పునీత్ బాగా కలిసే ఉంటారు.

మిగతా హీరోలతోనూ పునీత్​కు మంచి అనుబంధమే ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్​బాబు. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ ఇలా ప్రతి ఒక్కరితో పునీత్‌ ఎంతో స్నేహంగా కలిసి ఉన్న సందర్భాలు ఉన్నాయి. పునీత్‌ తన అన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కొడుకు పెళ్లి సమయంలో హైదరాబాద్​కు వచ్చి మరీ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఎందుకంటే చిరుకు మొదటి నుంచి రాజ్​కుమార్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి.

యువరత్న సినిమా ఇక్కడ విడుదలైనప్పుడు హైదరాబాద్ వచ్చిన పునీత్​ను చాలా మంది పవర్‌ స్టార్‌ అని పిలిచారు. పవర్‌స్టార్‌ అంటే ఎప్పుడూ పవన్‌కల్యాణే. నన్ను పునీత్‌ రాజ్‌కుమార్‌ అంటే చాలు అంటూ చెప్పి అభిమానుల మనసు దోచేశారు పునీత్. దూకుడు చిత్రాన్ని పునీత్​ రీమేక్‌ చేయగా ఆ చిత్ర ప్రమోషన్స్‌కు మహేశ్ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు కూడా. అప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహబంధం చూసి అభిమానులు తెగ సంతోషపడిపోయారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ కూడా అప్పట్లో పునీత్ నటించిన 'జాకీ' సినిమా ఆడియో లాంఛ్​కు గెస్ట్​గా హాజరయ్యారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక పునీత్ రీమేక్​ సినిమాల విషయానికొస్తే చాలా తెలుగు సినిమాలనే చేశారు. జనరల్​గా మనకు రెడీ అనగానే రామ్‌, ఇడియట్‌ అనగానే రవితేజ, ఆంధ్రావాలా అనగానే ఎన్టీఆర్‌, ఒక్కడు, దూకుడు అనగానే మహేశ్‌బాబు గుర్తొస్తారు. కానీ కన్నడ ప్రేక్షకులకు మాత్రం పునీత్‌ రాజ్‌కుమార్‌ ఒక్కరే గుర్తొస్తారు. ఎందుకంటే అక్కడ ఆ అన్నీ కథల్లోనూ అప్పునే నటించి ఆకట్టుకున్నారు.

ఆయన తెలుగు సినిమాలను రీమేక్‌ చేయడం మాత్రమే కాదు టాలీవుడ్​కు చెందిన ఇతర టెక్నిషియన్స్​, డైరెక్టర్స్​తోనూ పనిచేశారు. పూరీ జగన్నాథే అప్పు సినిమాతో పునీత్​ను హీరోగా పరిచయం చేశారు. మెహర్ రమేశ్​తో వీర కన్నడిగ చేశారు. ఈ సినిమాతోనే చక్రి కన్నడ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో ఆకాశ్‌, వంశీ అనే రెండు సినిమాలు చేశారు.

దూకుడు రీమేక్‌ కోసం తమన్​తో కలిసి వర్క్ చేశారు. జయంత్‌ సి. పరాన్జీతో నిన్నందలే సినిమా చేశారు. రచయిత, దర్శకుడు జనార్ధన్‌ మహర్షి అందించిన కథలతో ఆకాశ్‌, అరసు చిత్రాల్లో నటించారు. మొత్తంగా పునీత్ కెరీర్​లో హీరోగా 30 సినిమాల వరకు చేశారు. అందులో తెలుగు దర్శక, రచయితలు, సంగీత దర్శకులతో చేసి దాదాపు పది వరకు చిత్రాలు చేశారు.

బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్​ - దివాలా తీసిన ప్రముఖ దర్శకుడు

డేంజర్ జోన్​లో ఈ దర్శకులు - మళ్లీ హిట్​ కొడితేనే రేసులోకి!

Last Updated : Mar 17, 2024, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.