Priyamani Article 370: సౌత్ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ ప్రియమణి కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టీవీ షోస్‌లో జడ్జ్‌గా చేసిన ఈమె బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం ప్రియమణి బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమె రిసెంట్‌గా 'ఆర్టికల్ 370' సినిమాలో కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ క్రమంలో ప్రియమణి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
- 'ఆర్టికల్ 370' ప్రేక్షకులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు రాజకీయ ప్రచారం కోసం మలిచిన సినిమా అంటుంటే, మరికొందరు జనాల్లో చైతన్యం తీసుకొస్తున్న చిత్రంగా భావిస్తున్నారు. కానీ, ఈ మూవీ కేవలం వాస్తవిక సంఘటనల ఆధారంగానే తెరకెక్కింది. ఈ సినిమాతో ఆర్టికల్ 370 వెనక ఉన్న చరిత్ర, వాస్తవాలు, జరిగిన సంఘటనలు తెలియజేశాం.
- జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనేది ప్రభుత్వం తీసుకున్న డేరింగ్ డెసిషన్. అయితే ఇలాంటివి అమలు సందర్భాల్లో ఘర్షణలు అవుతుంటాయి. ఎన్నో ప్రాణాలు పోతుంటాయి. అదృష్టవశాత్తు అలాంటిది ఏం జరగలేదు. ఒక్క ప్రాణమూ పోలేదు. ఈ విషయంలో నేను గర్వపడుతుంటా.
- ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నిజంగా నాకు ఆర్టికల్ 370 గురించి తెలియదు. కథలోని సెన్సిటీవిటిపై పెద్దగా అవగాహన కూడా లేదు. అయితే షూటింగ్‌కు ముందే అనేక లోతైన విషయాలు తెలుసుకున్నా. ఇందులో నేను ప్రధానమంత్రి ఆఫీస్‌లో పని చేసే ఓ ఐఏఎస్ అధికారిణిగా నటించాను.
- సాధారణంగా సినిమాలో పాత్రల పరిధి, కథలో మార్పులు చేర్పుల విషయంలో ప్రతి దర్శకుడు, నటీనటులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ 'ఆర్టికల్ 370' అలా కాదు. వాస్తవిక సంఘటన ఆధారంగానే తెరకెక్కించాలి. 370 ఆర్టికల్ రద్దు సమయంలో జరిగిన విషయాలే చూపించాలి. మేమూ ఆ ప్రయత్నమే చేశాం.
- యామీ గౌతమ్ మంచి నటి. పక్కింటి అమ్మాయిలా ఉండే ఆమె యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. గతంలో తను ఏ సినిమాలో కూడా ఈ రేంజ్ ఎమోషన్ సీన్స్‌లో నటించలేదు. ఈ సినిమాలో మేం కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆసక్తిగా 'భామా కలాపం 2' టీజర్ - OTTలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ రాక అప్పుడే
థ్రిల్లర్ గ్లింప్స్ : డేంజరస్ వైఫ్‌గా ప్రియమణి - ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా భూమి పెడ్నేకర్