Preity Zinta Tollywood Re Entry : బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్టరీ వెంకటేశ్ జోడిగా 'ప్రేమంటే ఇదేరా', మహేశ్ బాబు సరసన 'రాజకుమారుడు' ఇలా రెండు క్లాసిక్ చిత్రాల్లో మెరిసి తన క్యూట్‌నెస్‌తో, నటనతో మెప్పించారు. అయితే ఆ రెండు సినిమాల తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ బాలీవుడ్ వరుస పెట్టి ఆఫర్లు అందుకుని అక్కడే సెటిల్ అయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కో ఓనర్‌గా కీలక బాధ్యతలు చేపడ్తున్నారు. పంజాబ్ ఆడుతున్న అన్నీ మ్యాచ్‌లకు హాజరై తన టీమ్‌ను ప్రోత్సహిస్తూ ఉంటారు.
వయసు పెరిగినా వన్నె తరగని అందంతో అందరినీ ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానలను అలరిస్తునే ఉంటారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్న ఈ సుందరి ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇదే విషయం గురించి అభిమానులతో ముచ్చటించారు.
"మీరు తెలుగు సినిమాల్లో మళ్లీ నటిస్తారా" అని ఓ నెటిజన్ అడిగన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ' నేను అసలు చేయను అని ఎప్పుడూ చెప్పలేదు. మంచి కథ వినిపిస్తే నేను నో చెప్పకుండా చేస్తాను' అంటూ ప్రీతి రిప్లై ఇచ్చారు. దీంతో అభిమానులు కూడా ఆమె త్వరలో తెలుగు తెరపై కనిపించాలని ఆశిస్తున్నారు. మరోవైపు బీటౌన్‌లోనూ ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 'లాహోర్ 1947' అనే చిత్రంలో కనిపించనున్నారు.
-
Never say never ❤️ who knows if I hear an amazing script I cannot say no to… https://t.co/z0P4RH1g5y
— Preity G Zinta (@realpreityzinta) May 6, 2024
'దిల్ సే' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రీతి, తొలి చిత్రంతోనే అభిమానులను ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి వరసు ఆఫర్లు అందుకుని లక్కీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. దశాబ్ద కాలంలోనే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న రికార్డు కూడా ఆమె ఖాతాలో ఉంది.
హిందిలోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. క్యా కెహనా (2000), కల్ హో న హో (2003), కోయీ మిల్ గయా (2003), వీర్ జరా (2004), చోరీ చోరీ చుప్కే చుప్కే (2001), దిల్ చాహతా హై (2001), దిల్ హై తుమారా (2002) లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తన వల్లే ప్రేమపై నమ్మకం కలిగింది : అదితి - Aditi Siddharth Engagement