ETV Bharat / entertainment

'మేము అలా చేసి ఉండకూడదు- కానీ తప్పలేదు'- షారుక్​కు​ సారీ చెప్పిన 'సలార్' డైరెక్టర్ - PRASHANTH NEEL SORRY TO SHAH RUKH

షారుక్​ ఖాన్​కు సారీ చెప్పిన సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- ఎందుకో తెలుసా?

Prashanth Neel Apology To Shah Rukh Khan
Prashanth Neel Apology To Shah Rukh Khan (Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 5:22 PM IST

Prashanth Neel Apology To Shah Rukh Khan : 'కేజీఎఫ్', 'సలార్​' సినిమాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ బాలీవుడ్‌ స్టారీ హీరో షారుక్‌ ఖాన్‌కు క్షమాపణలు చెప్పారు. సలార్‌ను కూడా డంకీ రిలీజ్​ అయిన సమయంలోనే రిలీజ్‌ చేయాల్సి వచ్చిందని, కానీ అలా చేసి ఉండేది కాదన్నారు. షారుక్‌తో పాటు 'డంకీ' మూవీ టీమ్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"షారుక్‌ టీమ్‌ ముందుగా రిలీజ్ తేదీని ప్రకటించింది. క్రిస్మస్‌కు రిలీజ్‌ చేస్తామని వారు సంవత్సరం ముందే ప్రకటించారు. కానీ 'సలార్‌'ను మేము అదే సమయంలో విడుదల చేశాం. ఈ విషయంలో షారుక్‌కు, 'డంకీ' టీమ్‌కు నేను క్షమాపణలు చెబుతున్నా. రెండు పెద్ద సినిమాలు ఒకేసమయంలో రిలీజ్ కాకూడదు. కానీ, మాకు ఆ తేదీనే బాగుందని జ్యోతిష్యులు చెప్పారు. అలాగే మరికొన్ని కారణాల వల్ల మేము ఆ సమయంలోనే రావాలని నిర్ణయానికి వచ్చాం. షారుక్‌, రాజ్‌కుమార్‌లు మంచి మనసున్న వ్యక్తులు. మమ్మల్ని అర్థం చేసుకున్నారు' అని ఆ వీడియోలో ప్రశాంత్‌ నీల్ వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది.

వీడియో వైరల్
'సలార్‌', 'డంకీ' సినిమాలు గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. డిసెంబర్‌ 21న 'డంకీ' ప్రేక్షకుల ముందుకు రాగా, డిసెంబర్‌ 22న 'సలార్‌' విడుదలైంది. దీని గురించి ప్రశాంత్‌ నీల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సలార్, డంకీ రెండు చిత్రాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, తొలిరోజే ఇవి మంచి కలెక్షన్లు వసూళ్లు చేశాయి.

NTRతో 'డ్రాగన్'!
ఇందిలా ఉండగా, ప్రశాంత్‌నీల్ ప్రస్తుతం మూడు సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ మాస్​ సినిమా 'సలార్‌-2, శౌర్యంగపర్వం పేరుతో సెట్స్‌ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే రెండు పార్ట్​లతో హిట్​ కొట్టి, ఇప్పుడు మూడో సీక్వెల్​ 'కేజీయఫ్‌ 3' స్క్రిప్ట్‌ వర్క్ కూడా పూర్తి చేశారు. యశ్‌, విజయ్‌ కిరంగదూర్‌ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వారి షెడ్యూళ్లు పూర్తవగానే కేజీయఫ్‌ మూడో పార్ట్​ను ప్రారంభిస్తారు. ఇక వీటి కంటే ముందుగా ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. #NTR31అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీకి 'డ్రాగన్‌' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

'మహానటి' కథ వినకముందే రిజెక్ట్​ చేసిన దుల్కర్​! మళ్లీ ఎందుకు నటించారు? నాగ్​ అశ్విన్ రివీల్!

ఈసారి గురుచూసి కొడుతున్న 'థండేల్'! రిలీజ్​ డేట్​ వచ్చేసిందబ్బా- ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.