ETV Bharat / entertainment

అక్టోబర్​ బాక్సాఫీస్ జాతర - దసరా, దీపావళికి థియేటర్లలో రానున్న చిత్రాలివే! - October 2024 Tollywood BoxOffice - OCTOBER 2024 TOLLYWOOD BOXOFFICE

October 2024 Tollywood BoxOffice Movies : దేవర, సత్యం సుందరం వంటి హిట్ చిత్రాలతో సెప్టెంబర్ నెల ముగిసింది. అక్టోబర్ నెల మొదలైంది. అయినా కూడా ఆ రెండు చిత్రాల హవా మరి కొన్ని రోజులు నడిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో అక్టోబరులో మరి కొన్ని పెద్ద, చిన్న చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎప్పుడు రానున్నాయో తెలుసుకుందాం.

source ETV Bharat
October 2024 Tollywood BoxOffice Movies (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 11:37 AM IST

October 2024 Tollywood BoxOffice Movies : దేవర, సత్యం సుందరం వంటి హిట్ చిత్రాలతో సెప్టెంబర్ నెల ముగిసింది. అక్టోబర్ నెల మొదలైంది. అయినా కూడా ఆ రెండు చిత్రాల హవా మరి కొన్ని రోజులు నడిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో అక్టోబరులో మరి కొన్ని పెద్ద, చిన్న చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎప్పుడు రానున్నాయో తెలుసుకుందాం.

  • మొదటి వారంలో రానున్న చిత్రాలివే

'చిట్టి పొట్టి' అనే సినిమా ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించారు. భాస్కర్‌ యాదవ్‌ దాసరి తెరకెక్కించారు. సిస్టర్‌ సెంటిమెంట్‌తో రూపొందిందీ చిత్రం.

Srivishnu Swag Release Date : టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ఈ సారి నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'శ్వాగ్‌', ఈ నెల 4న రిలీజ్ కానుంది. హసిత్‌ గోలి దర్శకత్వం వహించారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్‌, దక్ష నగర్కర్‌ కీలక పాత్రలు పోషించారు.

ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య నటించిన 'కలి' 4వ తేదీనే విడుదల కానుంది. శివ సాషు రూపొందించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కింది.

నోయల్‌, రిషిత నెల్లూరతో కలిసి రామ్‌ప్రసాద్‌ కొండూరు తెరకెక్కించిన 'బహిర్భూమి', సాయి ధన్సిక ప్రధాన పాత్రలో మంత్ర ఫేమ్‌ ఓషో తులసీరామ్‌ తెరకెక్కించిన 'దక్షిణ', నటుడు ప్రభాకర్‌ తనయుడు నటించిన తొలి సినిమా 'రామ్‌నగర్‌ బన్నీ', ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్‌ హీరోగా తెరకెక్కిన 'మిస్టర్‌ సెలబ్రిటీ' కూడా ఈ నెల 4వ తేదీనే రానున్నాయి.

  • రెండో వారం రానున్న చిత్రాలివే

Rajinikanth Vettaiyan Release Date : సూపర్ స్టార్ రజనీకాంత్‌ - జై భీమ్‌ ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా 'వేట్టాయన్‌' దసరా బరిలో దిగనుంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది.

హీరో గోపీ చంద్‌, డైరెక్టర్‌ శ్రీను వైట్ల కాంబోలో రూపొందిన 'విశ్వం', తండ్రీ కొడుకుల అనుబంధం తెరకెక్కించిన సుధీర్‌ బాబు - అభిలాష్‌ రెడ్డి కంకర 'మా నాన్న సూపర్‌హీరో' (Maa Nanna Superhero) ఈ నెల 11న రిలీజ్ కానున్నాయి.

సీనియర్ నటుడు అర్జున్‌ మేనల్లుడు ధ్రువ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం మార్టిన్‌, బాలీవుడ్‌ హీరోయిన్ అలియా భట్‌ నటించిన జిగ్రా కూడా ఈ నెల 11నే రానున్నాయి.

సుహాస్‌ ప్రధాన పాత్రలో సందీప్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనక అయితే గనక ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • ఇక మూడో వారంలో విడుదల కానున్న సినిమాల వివరాలు ప్రస్తుతానికి స్పష్టత లేవు.
  • నాలుగో వారంలో

స్వీయ దర్శకత్వంలో చంద్రశేఖర్‌ రాథోడ్‌ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్‌తో పాటు సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా నటించిన లగ్గం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Lucky Baskhar Amaran Release Date : ఇక దీపావళిని పురస్కరించుకుని పలు సినిమాలు రానున్నాయి. శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్‌తో పాటు దుల్కర్‌ సల్మాన్‌ - మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్‌, సత్యదేవ్‌, డాలీ ధనంజయ కలిసి నటించిన క్రైమ్‌ కామెడీ మూవీ జీబ్రా, విశ్వక్‌ సేన్‌ - మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న మెకానిక్‌ రాకీ ఈ నెల 31నే విడుదల రానున్నాయి. అలానే శ్రీమురళి, రుక్మిణీ వసంత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బఘీర కూడా ఇదే రోజున రానుంది.

రజనీకాంత్‌ 'వేట్టాయన్‌' సెన్సార్‌ రిపోర్ట్ ఇదే - ఆ మూడు డైలాగ్స్​పై అభ్యంతరం - Vettaiyan Movie Sensor

నా పిల్లలకు వాళ్ల గురించి చెబుతాను : శోభిత ధూళిపాళ్ల - SobhitaDhulipala About Her Children

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.