ETV Bharat / entertainment

తండ్రి కానున్న నిఖిల్​ - భార్య సీమంతంలో యంగ్ హీరో సందడి - నిఖిల్ వైఫ్​ సీమంతం

Nikhil Wife Baby Shower Photos : టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్​ తాజాగా తన ఫ్యాన్స్ కోసం గుడ్​ న్యూస్​ షేర్ చేశారు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Nikhil Wife Baby Shower Photos
Nikhil Wife Baby Shower Photos
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 10:32 PM IST

Nikhil Wife Baby Shower Photos : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తాజాగా తన ఫ్యాన్స్​ను ఓ స్వీట్​ న్యూస్​ చెప్పారు. త్వరలోనే ఆయన తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. తాజాగా తన భార్యకు సీమంతం వేడుక జరిగినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వేడుకలో తన భార్య పల్లవితో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ నిఖిల్ పల్లవి జంటకు కంగ్రాజ్యులేషన్స్​ తెలుపుతున్నారు.

"నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకనున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు అందించండి.' అంటూ నిఖిల్​ పోస్ట్ చేశారు. 2020లో నిఖిల్​ - పల్లవి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లాక్​డౌన్ కారణంగా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే - 'హ్యాపీడేస్'​ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో, తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. 'కార్తికేయ-1', 'స్వామి రారా', 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందారు.

Nikhil Upcoming Movies List : ఇక ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభూ' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. భరత్‌ కృష్ణమాచారి డైరెక్షన్​లో ఈ చిత్రం తెరకెక్కనుంది. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్​ ఓ వారియర్​ రోల్​లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్​ 'కార్తికేయ-3','ది ఇండియా హౌస్‌' అనే రెండు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు.

కమనీయం..రమణీయం.. హీరో నిఖిల్​ ప్రణయం

లాక్​డౌన్​ మ్యారేజ్​: డాక్టర్​తో యాక్టర్​ ప్రణయగానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.