ETV Bharat / entertainment

'సర్కార్ టేక్స్ ఛార్జ్' - 'హిట్ 3'లో నాని పవర్​ఫుల్ ఇంట్రో! - Nani Hit 3 Movie - NANI HIT 3 MOVIE

Nani Hit 3 Movie : ఇప్పటివరకూ సాఫ్ట్ రోల్స్ చేసిన నేచురల్ స్టార్ నాని త్వరలోనే ఓ పవర్​ఫుల్ పోలీస్​ ఆఫీసర్​గా కనిపించనున్నారు. ఆ వివరాలు మీ కోసం.

Nani Hit 3 Movie
Nani Hit 3 Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 1:04 PM IST

Nani Hit 3 Movie : నేచురల్ స్టార్ నాని లీడ్ ప్రస్తుతం వరుస సక్సెస్​లతో బిజీగా ఉన్నారు. ఇటవలే 'సరిపోదా శనివారం'తో అభిమానులను అలరించిన ఆయన, ఆ తర్వాత కూడా వరుస సినిమాలను లైనప్​లో పెట్టారు. అందులో హిట్ ఫ్రాంచైజ్​ ఒకటి. ఇప్పటికే ఆయన 'హిట్​ 2'లో అతిథి పాత్ర చేసి అలరించగా, ఇప్పుడు 'హిట్​ 3'లో ఫుల్ లెంగ్త్​ క్యారెక్టర్​లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని గతంలోనే వెల్లడించగా, తాజాగా కన్ఫార్మ్​ చేస్తూ మేకర్స్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్ చేశారు. 'సర్కార్ టేక్స్ ఛార్జ్' అంటూ నాని క్యారెక్టర్​ను పరిచయం చేశారు.

క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ ఐపీఎస్‌ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. శైలేశ్‌ కొలను డైరెక్షన్​లో ఇది పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజవ్వనుంది.

ఇక హిట్ ఫ్రాంచైజీలో ఇంతకుముందు విష్వక్‌ సేన్‌ 'హిట్‌', అలాగే అడివి శేష్‌ 'హిట్‌ 2'లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్​ సాధించాయి. దీంతో 'హిట్​ 3'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే నాని తొలిసారిగా పోలీస్‌ పాత్రలో నటించడం విశేషం.

ఆ యంగ్​ డైరెక్టర్ మూవీలో జాన్వీ- క్లారిటీ ఇచ్చిన నాని
'సరిపోదా శనివారం' ప్రమోషన్స్​లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన కొత్త సినిమాకు సంబంధించి కొద్ది రోజులుగా వస్తోన్న రూమర్స్‌కు ఫుల్​స్టాఫ్​ పెట్టారు. తన అప్​కమింగ్ మూవీలో జాన్వీ కపూర్‌ నటించనుందని వస్తోన్న ప్రచారంపై తాజాగా ఆయన స్పందించారు.

"నా తర్వాతి సినిమాలో జాన్వీ నటించనుందని వస్తున్న వార్తలు కేవలం రూమర్‌ మాత్రమే. బహుశ ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ అవుతోంది. నేను కొద్ది రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. అందుకే ఆ ప్రాజెక్ట్‌ గురించి ప్రస్తుతానికి వివరాలు క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నాను" అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశముంది.

15రోజులు మాకు నిద్ర లేదు: సక్సెస్​మీట్​లో నాని - Saripodhaa Sanivaaram

ఆ ఓటీటీలోనే 'సరిపోదా శనివారం' - ఎప్పుడు వస్తుందంటే? - Saripoda Sanivaram OTT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.