ETV Bharat / entertainment

రాకీ భాయ్​తో బీటౌన్ బ్యూటీ! - వాట్​ ఏ కాంబో సర్​జీ - Kareena Kapoor Yash Movie

Kareena Kapoor Yash Movie : రాకింగ్ స్టార్ యశ్​ - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ త్వరలో ఒకే స్క్రీన్​పై మెరవనున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ?

Kareena Kapoor Yash Movie
Kareena Kapoor Yash Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 8:48 PM IST

Updated : Mar 18, 2024, 8:55 AM IST

Kareena Kapoor Yash Movie : బీటౌన్ బ్యూటీ కరీనా కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే 'బకింగ్​హామ్ మర్డర్స్'​ అనే సినిమాలో మెరిసిన బెబో ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులతో బాలీవుడ్​లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో 'క్రూ' ఒకటి. సీనియర్ నటి టబు, పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్​తో కలిసి కరీనా ఈ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, మూవీ టీమ్ పలు ఇంటర్వ్యూల్లో మెరుస్తోంది. అయితే ఇందులో భాగంగా కరీనా ఓ టాప్ సీక్రెట్​ను రివీల్ చేశారు. ఇది కాస్త ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్​ను బలపరుస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా యశ్​ - సుధా కొంగర కాంబోలో వస్తున్న టాక్సిక్ సినిమాలో కరీనా కపూర్ ఫీమేల్ లీడ్​గా కనిపించనున్నారంటూ వార్తలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అయితే వాటిపై మూవీ టీమ్​ స్పందించలేదు. కానీ ఇప్పుడు కరీనా ఓ ఈవెంట్​లో తాను త్వరలో ఓ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా దాని ద్వారా సౌత్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు హింట్ ఇచ్చింది.

"నేను త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నాను. అది పాన్‌-ఇండియా ప్రాజెక్ట్​. మొదటిసారి ఇలాంటి సినిమాలో నేను పనిచేస్తున్నాను. దీని కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని నేను అర్థంచేసుకోగలను" అంటూ చెప్పుకొచ్చింది. ఇది విన్న ఫ్యాన్స్ ఈమె కచ్చితంగా యశ్ సినిమా గురించే మాట్లాడుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు. 'టాక్సిక్' హీరోయిన్ కరీనానే అంటూ గెస్ చేస్తున్నారు.

Yash 19 Cast : ఇక టాక్సిస్ సినిమా విషయానికి వస్తే - యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నర్ గీతూ మోహన్‌ దాస్‌ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. కేవీన్‌ఎన్‌ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌నున్నట్లు సమాచారం. ఇప్పటికే యశ్ బర్త్​డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ రివీల్ వీడియో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

Yash 19కు టైటిల్ ఖరారు - స్పెషల్ వీడియోతో రివీల్​ చేసిన మేకర్స్

రాకింగ్ స్టార్​ యశ్ కొత్త సినిమాలో బాలీవుడ్ బాద్​ షా

Last Updated : Mar 18, 2024, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.