Kalki Movie Nag Ashwin : 'కల్కి' సినిమా కోసం కథ రాయడానికి తనకు 5 ఏళ్లు పట్టిందని ఆ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా వెల్లడించారు. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో భాగంగా మూవీ టీమ్ విడుదల చేసిన 'వరల్డ్ ఆఫ్ కల్కి' అనే వీడియోలో ఆయన ఈ విశేషాలను పంచుకున్నారు.
"కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటన్నిటికీ 'కల్కి' క్లైమాక్స్. కేవలం భారత్‌లోని ఆడియెన్సే కాకుండా ప్రపంచంలో వారంతా ఈ విషయానికి బాగా కనెక్ట్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే చాలా ఆసక్తి ఉంది. 'పాతాళభైరవి' నా ఫేవరట్ మూవీ. అలాగే 'భైరవ ద్వీపం', 'ఆదిత్య 369', హాలీవుడ్ 'స్టార్ వరల్డ్' ఇలాంటి సినిమాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో అది ముగుస్తుంది. అక్కడి నుంచి కలియుగం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కథగా రాయలని నేను అనుకున్నాను. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఓ యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు ఇక కలియుగంలో ఎలా ఉంటాడు అనేది నేను చూపించాలని అనుకున్నాను. అతడితో పోరాటం చేయడం చూపించాం. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సైన్స్‌కు మైథాలజీని జోడించి మరీ ఈ చిత్రాన్ని తీశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని నాగ్ అశ్విన్ తెలిపారు.
ఇక 'కల్కి' విషయానికి వస్తే ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిన విషయమే. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది.