Kalki 2898 AD 500 Crores Collections : ప్రభాస్ 'కల్కి' - ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో మరో లెవల్‌కు ఎదిగిపోయారనే చెప్పాలి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఏ హీరో సాధ్యం కానీ రికార్డులను సృష్టిస్తున్నారు.
తాజాగా కల్కి చిత్రమైతే ఏకంగా నాలుగు రోజుల్లో రూ.500 కోట్లకుపైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ షేక్ చేసింది. ఏకంగా రూ.555 కోట్లు సాధించినట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే ఆయన నటించిన 'కల్కి' మాత్రమే కాదు గతంలోనూ మరో మూడు చిత్రాలు కూడా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ రేంజ్ రికార్డ్ సాధ్యం కాలేదనే చెప్పాలి.
రూ.500 కోట్లు వసూలు చేసిన ప్రభాస్ చిత్రాలు ఇవే
1. బాహుబలి 2 - దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ హిస్టారికల్ ఎపిక్ డ్రామాలో ప్రభాస్‌తో పాటు అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, సుదీప్ కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1814 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. విడుదలకు ముందే రూ. 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది.
2.బాహుబలి - ఈ చిత్రంతోనే తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. హాలీవుడ్ ప్రముఖులు కూడా సినిమా అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 632 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది.
3. సలార్ - 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సక్సెస్ కాకపోయినప్పటికీ మంచి వసూళ్లనే సాధించాయి. కానీ రూ.500 కోట్లు దాటలేదు! అనంతరం భారీ అంచనాలతో వచ్చిన 'సలార్' మళ్లీ ప్రభాస్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 623.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
4. కల్కి 2898 ఏడీ - ఇప్పుడు 'కల్కి' ప్రభంజనం సృష్టిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లో రూ.550 కోట్లు వసూళ్లు చేసింది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా లాంగ్ రన్ టైమ్‌లో రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు వసూళ్లను అందుకుంటుందని ట్రేడ్ వర్గాల నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
ఓవర్సీస్లో కల్కి దూకుడు- తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్! - Kalki 2898 AD