ETV Bharat / entertainment

ప్రభాస్ 'జోకర్' - అర్షద్ వార్సి కాంట్రవర్సీ కామెంట్స్​పై ​స్పందించిన నాగ్​ అశ్విన్​ - Prabhas Joker Controversy - PRABHAS JOKER CONTROVERSY

Kalki 2898 AD Prabhas Joker Controversy Nag Ashwin Reaction : రీసెంట్​గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సి 'కల్కి' సినిమాను ఉద్దేశించి ప్రభాస్ లుక్​ జోకర్​లా ఉందని కామెంట్స్​ చేయడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంపై కల్కి 2898 ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్​ కూడా స్పందించారు. ఏమ్నారంటే?

source ETV Bharat and Getty Images
Kalki 2898 AD Prabhas Joker Controversy Nag Ashwin Reaction (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 9:15 AM IST

Updated : Aug 24, 2024, 9:51 AM IST

Kalki 2898 AD Prabhas Joker Controversy Nag Ashwin Reaction : 'కల్కి 2898 ఏడీ'తో రూ.1100 కోట్ల భారీ బ్లాక్ బస్టర్​ హిట్ అందుకున్నారు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్​, అమితాబ్​ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్​ సినిమాకే హైలైట్​గా నిలిచాయి. ​అయితే రీసెంట్​గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సి 'కల్కి' సినిమాను ఉద్దేశించి ప్రభాస్ లుక్​ జోకర్​లా ఉందని కామెంట్స్​ చేశారు. ఈ విషయం పెద్ద ఎత్తున వివాదస్పదమైంది. దీంతో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్​ అంటూ మరోసారి సోషల్​ మీడియాలో వార్​ చర్చనీయాంశమైంది. టాలీవుడ్​లోని చాలా మంది దర్శకనిర్మాతలు, నటులు అర్షద్​పై విమర్శలు గుప్పించారు. అలా అనడం కరెక్ట్ కాదని సూచించారు.

Arshad Warsi Comments on Prabhas : అయితే ఇప్పుడు ఈ విషయంపై తాజాగా కల్కి 2898 ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్​ కూడా స్పందించారు. భాష ఆధారంగా సినిమాను వేరు చేసి చూడొదని అన్నారు. 'కల్కి 2'లో ప్రభాస్‌ను మరింత బెస్ట్‌గా చూపిస్తానని చెప్పారు.

"నార్త్‌ - సౌత్‌, టాలీవుడ్‌ వెర్సస్‌ బాలీవుడ్‌ అంటూ పోల్చి వెనక్కి వెళ్లొద్దు. అందరం ఒక పరిశ్రమకే చెందిన వాళ్లం. అర్షద్‌ ఇంకాస్త హుందాగా మాట్లాడాల్సింది. అయినా పర్వాలేదు. మేము ఆయన పిల్లల కోసం 'కల్కి' బుజ్జి బొమ్మలను పంపిస్తాం. కల్కి సెకండ్​ పార్ట్​ కోసం మరింత కష్టపడి పని చేస్తాను. అందులో ప్రభాస్‌ను మరింత బెస్ట్‌గా చూపిస్తాను" అని చెప్పుకొచ్చారు. "ఈ ప్రపంచంలో చాలా మంది మనల్ని ద్వేషిస్తారు. కానీ మనం వాటిని పట్టించుకోకూడదు. ముందుకెళ్లిపోవాలి" అని నాగ్‌అశ్విన్‌ చెప్పారు. ప్రభాస్‌ కూడా ఇదే మాట తనతో అంటుంటారని గుర్తు చేసుకున్నారు.

Kalki 2898 AD OTT : ఇకపోతే ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్​ఫ్లిక్స్​లో హిందీ వెర్షన్​, అమెజాన్ ప్రైమ్​లో తెలుగు, తమిళం సహా ఇతర దక్షిణాది​ భాషల్లో అందుబాటులో ఉంది. సినిమాలో అమితాబ్​, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

టాలీవుడ్​కు కొత్త అందాలు - నందమూరి వారసుల కోసం ఇద్దరు భామలు - Tollywood Upcoming New Heroines

ఒకే ఏడాదిలో 6 బ్లాక్​బస్టర్స్​ - ఆ రేర్ రికార్డు బాలయ్యకే సొంతం! - Balakrishna Hit Movies List

Last Updated : Aug 24, 2024, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.