Vidya Balan Kahaani Movie : ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. ఆయా స్టార్ల కెరీర్లను ఓ రేంజ్‌లోకి తీసుకెళ్లాయి కూడా. కథ బాగుంటే ఎటువంటి సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టిన రోజులు కూడా సినీ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.
అయితే పెద్ద బడ్జెట్, స్టార్ హీరో ఉంటేనే సినిమా నడుస్తుందన్న కాలంలోనూ ఓ సినిమా ఈ అంచనాలన్నింటినీ దాటి చరిత్రెక్కెక్కింది. 2012లో వచ్చిన ఈ హీరోయిన్ ఓరియెంటడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మాసివ్ టాక్ అందుకోవడమే కాకుండా అందులోని హీరోయిన్ స్టార్డమ్న మరింత పెంచింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన 'కహానీ'.
ఆ ఏడాదిలో విడుదలైన సినిమాలలో బెస్ట్ సినిమాలలో ఇది ఒకటి. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.104 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సాధించింది. ఒక గర్భవతిగా విద్యా బాలన్ నటనకు చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఉత్తమ నటిగా అవార్డులతో పాటు ఆ చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ కు కూడా చాలా అవార్డులు వచ్చాయి. బెస్ట్ కథ, స్క్రీన్ ప్లే తో ఆ ఏడాది 3 జాతీయ అవార్డులు ఈ మూవీ సొంతం చేసుకుంది.
బెంగాలీ నటుడు పరంబ్రతా చటర్జీకు కూడా మంచి గుర్తింపుతో పాటు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆశ్చర్యంగా ఆ తర్వాత అతనికి వచ్చిన అవకాశాలు కూడా ఎక్కువ థ్రిల్లర్ సినిమా లేదా సిరీస్ లోనే అవకాశం వచ్చాయి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా చేసిన నవాజుద్దీన్ సిద్దికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది.
ఇక కహానీకి సీక్వెల్‌గా 2016లో వచ్చిన 'కహానీ 2' అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను తెలుగు తమిళంలోనూ నయనతార లీడ్ రోల్లో పెట్టి తీశారు. అయితే ఆ చిత్రం అంచనాలను అందుకోలేక నిరాశపరిచింది.
5 సెకన్ల సినిమా ఛాన్స్ - స్టార్‌గా మారిన బిచ్చగాడు - గర్ల్ ఫ్రెండ్ కూడా! - PK Aamir Khan Movie
ఆ సినిమాపై 34 కేసులు, నటికి వేధింపులు - దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీ ఏదంటే ?