ETV Bharat / entertainment

ఎన్టీఆర్​తో సినిమా చేయాలంటే అంత బడ్జెట్ పెట్టుకోవాలా - స్వయంగా చెప్పిన యంగ్ టైగర్! - Juniour NTR Movie Budget - JUNIOUR NTR MOVIE BUDGET

JR NTR Movie Budget : తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టిన తన స్వయంకృషి, పట్టుదలతో తనకంటూ సొంత ఐడెండిటినీ క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు సినిమా సినిమాకు తనకంటూ ఓ రేంజ్ పెంచుకుంటూ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగారు. ఇన్నేళ్ల కెరీర్​లో ఈయన నటించిన సినిమాల కలెక్షన్స్ కూడా అదే రేంజ్​లో పెరిగాయి. అయితే తనతో ఓ సినిమా తీయాలంటే ఎంత బడ్జెట్ అవుతుందో, రెమ్యునరేషన్ ఎంత అనే విషయంపై మాట్లాడారు తారక్. ఆ వివరాల్ని తెలుసుకుందాం.

ఎన్టీఆర్​తో సినిమా చేయాలంటే అంత బడ్జెట్ పెట్టుకోవాలా - స్వయంగా చెప్పిన యంగ్ టైగర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 10:10 AM IST

JR NTR Movie Budget : జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినీఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 23ఏళ్లు కావోస్తోంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. చిన్నప్పుడు నటించిన రామాయణం సినిమా నుంచి ఇప్పుడు నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వరకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన డ్యాన్స్​కు, నటనకు డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్​ఆర్​ఆల్​లోని తన నటనతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో తన అద్భుత నటనకు గాను ఉత్తమ హీరోగా అవార్డును కూడా దక్కించుకున్నారు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అంతేకాదు ఆయన సినిమాల కలెక్సన్స్ కూడా పెరుగుతూనే వచ్చింది.

అయితే ఎన్టీఆర్ తీసే సినిమాకు భారీ బడ్జెట్ ఉండాల్సిందే అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. దీనిపై ఎన్టీఆర్ గతంలో ఓ సారి స్పందించారు. తనతో సినిమా తీయాలంటే నిర్మాత ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమా బడ్జెట్ అనేది కథపై ఆధారపడి ఉంటుంది. ఒక దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నప్పుడు ఆ కథను సినిమాగా మల్చలాంటే వేసే సెట్టింగ్స్ నుంచి ఆ సినిమాలో నటించే హీరో వరకు ప్రతీది ముందే డిసైడ్ అవుతుంటారు. ఉదాహారణకు సినిమాల్లో వేసే సెట్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో తయారు చేసినవి వేస్తుంటారు. వాటి ఖర్చు భారీగా ఉంటుంది. హీరో రెమ్యూనరేషన్ గురించి బయట చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు.వంద కోట్లు రెమ్యూనేషన్ తీసుకున్నాడు అంటుంటారు. కానీ అసలు నిజం వేరు. చాలా మందికి ప్రతీది కూడా భూతద్దంలో పెట్టి చూడటం అలవాటుగా మారింది. హీరోల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడేవారు. మాకంటే బయట కోట్లు సంపాదిస్తున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు.వాళ్ల గురించి ఎందుకు మాట్లాడరు. కానీ మేము సంపాదించే దాంట్లో ఏమీ ఉండదు. ఒక హీరోకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలనేది. మార్కెట్లో ఆ హీరోకు ఉన్నా ఫాలోయింగ్​ ఆధారంగా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తారు. అంతేకానీ హీరో డిమాండ్ చేసేది ఏమీ ఉండదు" అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర(NTR Devara Movie) చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దీనికి దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

47ఏళ్ల వయసులో మీనా రెండో పెళ్లి - ఆమె ఏం చెప్పిందంటే? - Meena Second Marriage

సెకండ్ ఇన్నింగ్స్ లో జ్యోతిక జోరు!- ఆమె అందానికి రహస్యమిదే? - ACTRESS JYOTIKA SECOND INNINGS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.