ETV Bharat / entertainment

'దేవదాసు'కు ముందే టాలీవుడ్​లోకి ఎంట్రీ! ఇలియానా మిస్ చేసుకున్న సినిమా ఏదంటే ? - Ileana First Movie - ILEANA FIRST MOVIE

Ileana First Telugu Movie : గోవా బ్యూటీ ఇలియానా నటించిన తొలి తెలుగు సినిమా 'దేవదాస్​'. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ దీనికంటే ముందు ఆమె మరో ప్రాజెక్ట్​తో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందట. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ?

Ileana First Telugu Movie
Ileana First Telugu Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 8:04 AM IST

Updated : Apr 24, 2024, 9:54 AM IST

Ileana First Telugu Movie : గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బీటౌన్​లో బిజీ అయిపోయింది. గతంలో సౌత్​లో పలు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది ఇప్పుడు హిందీలోనూ తన సత్తా చాటుతోంది.

'దేవదాసు' సినిమాతో హీరోయిన్​గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లీడ్ రోల్​లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మాసివ్ సక్సెస్ అందుకుంది. రామ్ కూడా ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యారు. కానీ, ఇలియానా తెలుగులో చేయాల్సిన మొదటి సినిమా ఇది కాదట. ఆమె వేరే సినిమా కోసం ఎంపికవ్వగా, పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్​లోకి తను వెళ్లలేదట.

యంగ్ హీరో నితిన్​ నటించిన 'ధైర్యం' సినిమాకు తొలుత ఇలియానానే ఫిక్స్ చేశారట. ఆ సినిమాకి ఆడిషన్స్ ఇచ్చిన ఇలియానా, సెలక్ట్ అయ్యి, 3 నెలల కాల్షీట్ డేట్స్ కూడా ఇచ్చిందట. అయితే పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్​ నుంచి ఇలియానా తప్పుకోవాల్సి వచ్చిందట. దీంతో దేవదాసుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయతే ధైర్యం సినిమా 2005లో విడుదలైంది. రైమాసేన్, నితిన్​ లీడ్​ రోల్స్​లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. ఇక 2006లో వచ్చిన 'దేవదాసు' అటు హీరో రామ్​కు అలాగే హీరోయిన్ ఇలియానాకు మంచి బ్రేక్ ఇచ్చింది. దీని తర్వాత ఆ ఇద్దరికీ మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. 'పోకిరి', 'రాఖీ', 'జల్సా', 'కిక్‌' వంటి సినిమాలతో ఇలియానా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్​లోనూ సూపర్ ఫామ్​లో దూసుకెళ్లింది. 'బర్ఫీ', 'రుస్తుమ్', 'ఫటా పోస్టర్ నిక్​లా హీరో', 'మై తేరా హీరో, 'రాయిడ్' లాంటి సినిమాల్లో చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్​తో సోషల్ మీడియాలో టచ్​లో ఉంది. ఇటీవలే 'కోవా ఫీనిక్స్ డోలన్‌' అనే చిన్నారికి జన్మనిచ్చింది. తేరా క్యా హోగా లవ్​లీ సినిమాతో కమ్​బ్యాక్ ఇచ్చింది. 'దో ఔర్ దో ప్యార్' అనే సినిమాలోనూ నటించింది.

'అందుకే కోవా అని పెట్టాం' - కుమారుడి పేరుకి అర్థం చెప్పిన ఇలియానా

20 గంటలు పనిచేస్తే.. నన్ను విమర్శించారు: ఇలియానా

Last Updated : Apr 24, 2024, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.