ETV Bharat / entertainment

నాకు ఆ విషయంలో ఓపిక లేదని డైరెక్టర్​కు సూటిగా చెప్పేశా : ఇలియానా - Ileana Do Aur Do Pyaar Movie - ILEANA DO AUR DO PYAAR MOVIE

Ileana Do Aur Do Pyaar Movie : దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. 'దో ఔర్ దో ప్యార్' అనే హిందీ సినిమాతో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి పంచుకుంది.

Ileana Do Aur Do Pyaar Movie
Ileana Do Aur Do Pyaar Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 7:32 AM IST

Updated : Apr 25, 2024, 10:16 AM IST

Ileana Do Aur Do Pyaar Movie : 'దేవదాసు' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత యి. 'పోకిరి', 'రాఖీ', 'జల్సా', 'కిక్‌' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత స్లోగా బాలీవుడ్​లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా సూపర్ ఫామ్​లో దూసుకెళ్లింది. 'బర్ఫీ', 'రుస్తుమ్', 'ఫటా పోస్టర్ నిక్​లా హీరో', 'మై తేరా హీరో, 'రాయిడ్' లాంటి సినిమాల్లో చేసింది. అయితే దాదాపు మూడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ చిన్నది, తాజాగా 'దో ఔర్ దో ప్యార్' అనే హిందీ సినిమాతో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి పంచుకుంది. ఆ విషయాలు తన మాటల్లోనే

సినిమాల ఎంపికలో నేను ఆచితూచి వ్యవహరిస్తుంటాను. అందుకే అప్పుడప్పుడు బ్రేక్ వస్తుంది. అయితే ఈసారి మాత్రం అలా కాదు. మంచి పాత్రల కోసం చూస్తున్న సమయంలోనే 2020లో కరోనా వచ్చింది. 'దో ఔర్‌ దో ప్యార్‌' సినిమా షూటింగ్ 2021లోనే మొదలైంది. అయితే ఈలోగా నేను ప్రెగ్నెంట్​ కావడం, మా బాబు పుట్టడం వల్ల మరింత గ్యాప్‌ వచ్చింది.

ఈ సినిమాలోని నోరా పాత్రకు, నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలుంటాయి. ఆ పాత్రలాగే నేనూ చాలా సెన్సిటివ్​గా ఉంటాను. నాకంటూ గాఢంగా ప్రేమించే ఓ వ్యక్తి ఉండాలని కోరుకుంటాను. నచ్చినవాళ్లని హత్తుకోవడం, మనస్ఫూర్తిగా ప్రేమించడం, వాళ్లని బాగా నమ్మడం వంటి పనులు చేస్తుంటాను. జనం ముందు కూడా ఇవన్నీ చేయడానికి నేను వెనకాడను. నోరా కూడా ఇంచుమించు అలాంటిదే. తన సొంతం అనుకున్న వ్యక్తి రోజంతా తనతోనే ఉండాలనుకుంటుంది.

కొంతమంది ఎప్పుడూ ఎదుటివాళ్లను జడ్జ్‌ చేయాలని చూస్తుంటారు. వాళ్లే ఆ వ్యక్తుల గురించి ఓ ఓపినియన్ బిల్డ్ చేస్తుంటారు. అలాంటివి విని, నవ్వుకోవడం తప్ప మనం చేసేది ఏం ఉండదు. 'దో ఔర్‌ దో ప్యార్‌' సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఓకే చెప్పాను. ఆ స్టోరీ నాకు అంత బాగా నచ్చింది. నెగెటివ్‌ కోణమున్న పాత్ర కావడం వల్ల డైరెక్టర్ శిరీషా కూడా నేను అంత తొందరగా ఒప్పుకుంటానని అనుకోలేదేమో!

ఈ పాత్ర కోసం నేను ఎలాంటి కసరత్తులు చేయలేదు. శారీరకంగా కూడా ఏమీ మార్చుకోలేదు. ఆ సమయంలో నా పాత్ర కోసం నన్ను నేను మార్చుకునే ఓపిక కూడా లేదు. మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. "నేనిప్పుడు ఫిట్‌గా లేను. మానసికంగా చాలా అలసిపోయాను. బరువు తగ్గడం నావల్ల కాదు" అంటూ శిరీషతో చెప్పేశాను. అప్పుడు తను 'స్టుపిడ్‌లా మాట్లాడకు. నువ్వు ఎలా ఉంటే అలాగే కంటిన్యూ అవ్వు' అంటూ నాకు భరోసా ఇచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దేవదాసు'కు ముందే టాలీవుడ్​లోకి ఎంట్రీ! ఇలియానా మిస్ చేసుకున్న సినిమా ఏదంటే ? - Ileana First Movie

ఎట్టకేలకు ప్రియుడి ఫొటోలు షేర్ చేసిన ఇలియానా.. అతడెవరో తెలుసా?

Last Updated : Apr 25, 2024, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.