Ileana D Cruz Son Name : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఇటు సౌత్‌తో అటు నార్త్‌లోనూ పాపులరైంది. పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని సందడి చేసింది. అయితే బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసిన ఇలియానా ఆ తర్వాత క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆమె ప్రెగ్నెంట్ అని అభిమానులకు షాకిచ్చింది. ఆ తర్వాత కోవా డోలన్ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త మైఖెల్తో కలిసి చిన్నారి ఆలన పాలన చూసుకుంటోంది. అప్పుడప్పుడు తన కుమారుడితో గడిపిన స్వీట్ మూమెంట్స్‌ను నెట్టింట షేర్ చేస్తుంటుంది. అయితే ఆ చిన్నారికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరును ఎందుకు పెట్టిందో తాజాగా వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేసింది.
"నాకు కచ్చితంగా ఆడపిల్ల పుడుతుందని అనుకున్నాను. అందుకే నేను అన్నీ ఆడపిల్లలకు సంబంధించిన పేర్లను సెర్చ్ చేశాను. అబ్బాయిల పేర్ల గురించి అస్సలు ఆలోచించలేదు. బ్యాకప్‌గా కొన్ని పేర్లను సిద్ధంగా ఉంచుకోవాలా అని అనుకున్నాను. కానీ నాకు కచ్చితంగా ఆడపిల్లనే పుడుతుందని నమ్మాను. అయితే నా బిడ్డకు డిఫరెంట్ పేరు పెట్టాలని అనుకున్నాను. నా పేరు కూడా కాస్త స్పెషల్‌గానే ఉంటుంది కదా అందుకే అలా అనుకున్నా. అప్పుడే నాకు కోవా అనే పేరు గుర్తొచ్చింది. ఈ విషయం గురించి నా భర్త మైఖెల్తో మాట్లాడాను. తనకు కూడా ఈ పేరు నచ్చింది. ఇక గత కొంత కాలంగా ఫీనిక్స్ అనే పేరు నా మదిలో మెదులుతూనే ఉంది. దీనికి ఓ ఇంగ్లీష్ లైన్ నాకు ఇన్పిరేషన్. అంతే కాకుండా నేను 2018లో ఫీనిక్స్ అనే పచ్చబొట్టు వేయించుకున్నాను. ఈ పేరు మైక్‌కు నచ్చింది. అలాగే పెద్దయ్యాక కోవా కూడా దీన్ని ఇష్టపడతాడని నేను ఆశిస్తున్నాను" అంటూ తన కుమారుడి పేరు ఎలా పెట్టారో చెప్పుకొచ్చింది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ బిజీ - వాళ్లకు థ్యాంక్స్ చెప్పిన గోవా బ్యూటీ