ETV Bharat / entertainment

షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన హీరో రానా - కింగ్ ఖాన్ రియాక్షన్ ఏంటంటే? - Rana Touches Shah Rukh Khan Feet - RANA TOUCHES SHAH RUKH KHAN FEET

Rana Shah Rukh Khan : టాలీవుడ్​ విలక్షణ నటుడు రానా చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్​ కాళ్లు మొక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు రానాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

source Getty Images and ETV Bharat
Shah Rukh Khan Rana (source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 9:58 AM IST

Rana Shah Rukh Khan : టాలీవుడ్​ హీరో​ రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్​​ ప్రారంభం నుంచే విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'బాహుబలి' సిరీస్​తో వరల్డ్​వైడ్​గా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా భిన్నమైన పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. అయితే తాజాగా ఆయన ఐఫా 2024 ప్రీ ఈవెంట్​లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రానాతో పాటు షారుక్ ఖాన్, కరణ్ జోహార్, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ సహా పలువురు హాజరయ్యారు.

ఈ ఈవెంట్​లో ఈ తరం వాళ్లు సీనియర్ల కాళ్లు ఎలా మొక్కుతారో చెబుతూ షారుక్ ఖాన్ స్టేజ్​పై ఫన్నీగా చేసి చూపించారు. తన పక్కనే ఉన్న కరణ్ జోహార్ కాలిని తన కాలితో టచ్ చేసిన షారుక్​, ఆ తర్వాత తన కాలినే తాను మొక్కుతూ సరదాగా చేసి చూపించారు. అదే సమయంలో స్టేజ్ పైకి వచ్చిన రానా మొదటగా షారుక్​ను హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత తాను పక్కా సౌత్ ఇండియన్ అని చెప్పారు. కాళ్లు తాము ఇలా మొక్కుతామంటూ చెబుతూనే షారుక్, కరణ్ జోహార్ కాళ్లు మొక్కారు రానా. దీంతో రానా చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు! షారుక్ కూడా నవ్వుతూ రానాను హగ్ చేసుకున్నారు.

షారుక్ ఖాన్ కాళ్లను రానా మొక్కగానే అక్కడే ఉన్న ఆడియెన్స్ కేరింతలు కొడుతూ రానాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు 'సౌత్ ఇండియన్స్ సంస్కృతి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది', 'హ, హ, హ, సూపర్ క్యూట్' అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Rana Sharukh Khan Upcoming Movies : కాగా, రానా ప్రస్తుతం రజనీ కాంత్ నటించిన 'వేట్టాయన్'​ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. షారుక్ తన కూతురితో కలిసి 'కింగ్' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు.

ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ అప్డేట్​! - ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే? - Prabhas Hanu Raghavapudi Movie

OTTలోకి శోభిత ధూళిపాళ్ల లవ్, హార్ట్​ బ్రేక్​ స్టోరీ! - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​ - Sobhita Dhulipala Love Sitara OTT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.