ETV Bharat / entertainment

షారుక్, కాజోల్ కాదు - బీటౌన్​లో ఈ హిట్​ పెయిరే ఫేమస్​! - Actress Most Films With Shahrukh - ACTRESS MOST FILMS WITH SHAHRUKH

బాలీవుడ్​లో హిట్ పెయిర్ అంటే అందరి నోట షారుక్ కాజల్ పేర్లే వినిపిస్తాయి. అంతలా ఈ జంట స్ర్కీన్​పై సందడి చేసింది. అయితే ఓ బీటౌన్ స్టార్ హీరోయిన్ కాజల్​ కంటే ఎక్కువ సార్లు షారుక్​తో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 7:19 PM IST

Heroine Who Acted Most Films With Shahrukh Khan : జానర్​ ఏదైనా తన పాత్రలో ఇట్టే ఒదిగిపోతారు బాలీవుడ్ బాద్​షా షారుక్​ఖాన్​. ఇటీవలే ఎన్నో యాక్షన్ సినిమాల్లో ఆయన నట విశ్వరూపాన్ని చూశాం. కానీ ఒకప్పటిలో ఆయన కింగ్​ ఆఫ్​ రొమాన్స్​గానూ పెరొందారు. తన క్యూట్​ లుక్స్​తో ఎంతో మంది అమ్మాయిల డ్రీమ్​బాయ్​గా రాణించారు. చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలంటూ ఫ్యాన్స్​ కూడా అనుకునేవారు.

ఇక ఫ్యాన్సే కాదు అప్పటి హీరోయిన్లు కూడా కింగ్ ఖాన్​తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఉవ్విళ్లూరేవారు. ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలనుకునేవారు. అయితే ఇప్పటి వరకు ఆయనతో ఎంతో మంది కనిపించినప్పటికీ షారుక్ కాజోల్ జోడీకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఈ జంట ఆన్​స్క్రీన్ కెమిస్ట్రీ ఎన్నో హిట్ సినిమాలకు బాటలు వేశాయి. ఆఫ్​స్క్రీన్​లోనూ ఈ జంట ఎంతో మంచి స్నేహితులగానూ కొనసాగుతున్నారు. ఇప్పటికీ బాలీవుడ్​లో బెస్ట్ ఆన్​స్క్రీన్ జోడీ అంటే ఈ ఇద్దరి పేర్లే వినిపిస్తుంది.

1993లో 'బాజీగర్' సినిమాలో వీరిద్దరూ కలిసి తొలిసారి పనిచేశారు. ఆ తర్వాత 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'. 'కుచ్ కుచ్ హోతా హై', 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'మై నేమ్ ఈజ్ ఖాన్'లో కలిసి నటించారు. ఇక షారూఖ్ - కాజోల్ కాంబినేషన్‌లో వచ్చిన ఆఖరి సినిమా 'దిల్ వాలే.' ఇలా ఈ హిట్ పెయిర్ కాంబోలో 7 సినిమాలు ఉన్నాయి. అయితే షారుక్​తో ఈమె కంటే ఎక్కువగా ఓ నటి తెరపై కనిపించి సందడి చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే ?

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్​ హీరోయిన్ జూహీ చావ్లా. ఆ రోజుల్లో హీరో హీరోయిన్లుగా షారుక్​ - జూహీ సినిమాల్లో కనిపిస్తే ఇక తెరపై ఉంది తామే అన్నట్లు ఫీలైపోయేవాళ్లట ఫ్యాన్స్.

1992లో విడుదలైన 'రాజు బన్ గయా జెంటిల్‌మాన్'‌ సినిమాతో ఈ జంట తొలిసారి స్క్రీన్​పై సందడి చేసింది. ఆ తర్వాత 1993లో 'డర్', 1995లో 'రామ్ జానే', 1997లో 'యస్ బాస్' వంటి సినిమాల్లోనూ నటించి లవ్లీ పెయిర్ అనిపించుకుంది.

ఇక 1998లో రిలీజైన డూప్లికేట్ సినిమాలోనూ ఈమె నటించింది. అయితే ఇందులోని ఒక పాత్రలో సోనాలి బింద్రే కూడా షారుక్​కు జోడీగా నటించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో 'ఫిర్ భీ దిల్ హై హిందూస్తానీ'(2000) వచ్చింది. 'వన్ 2 కా 4'లో కూడా షారూఖ్, జూహీలు జంటగా కనిపించారు. ఇక చివరిసారిగా వీరిద్దరూ పెయిర్ గా వచ్చిన సినిమా సూపర్ నేచురల్ కామెడీ ఫిల్మ్ 'భూత్ నాథ్'(2008). మొత్తానికి షారూఖ్ ఖాన్ తో కలిసి కాజోల్ నటించిన సినిమాలు 7 అయితే జూహీ చావ్లా జతకట్టిన సినిమాలు 8.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'షారుక్ దగ్గర 17 ఫోన్లు' - షాకింగ్​ విషయాలు రివీల్​ చేసిన ఫ్రెండ్​

'షారుక్​కు నేనంటే ఎంతో నమ్మకం- అందుకే ఆ విషయాలు నాతో షేర్ చేసుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.